monkey joy ride in delhi metro video viral
monkey joy ride in delhi metro video viral

Monkey in Metro : అరేయ్.. కోతి పనులు చేయకురా? అంటూ మన పెద్ద వాళ్లు.. పిల్లలను ఎప్పుడూ కోతులతో పోల్చుతూ ఉంటారు. ఎందుకంటే.. కోతులు ఒక్క చోట నిలకడగా ఉండవు. వాటి పనులు చూస్తే మనమే నివ్వెరపోతాం. అవి చేసే చిలిపి చేష్టలు మమూలుగా ఉండవు. అవి ఎక్కడ ఉంటే అక్కడ రచ్చే. అందుకే కోతి చేష్టలు అని అంటుంటాం. అయితే.. మనం రోజురోజుకూ పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాం. అడవులను నరికేస్తున్నాం. అందుకే.. అడవుల్లో ఉండాల్సిన కోతులు.. ఊళ్లలోని వస్తున్నాయి. సిటీలలోనూ ఇప్పుడు కోతులు దర్శనమిస్తున్నాయి.

monkey joy ride in delhi metro video viral
monkey joy ride in delhi metro video viral

తాజాగా ఓ కోతి అయితే ఏకంగా మెట్రో ట్రైన్ ఎక్కేసింది. మెట్రో ట్రెయిన్ ఎక్కిన కోతి ఇక ఆగుతుందా? అది చేసిన రచ్చ మామూలుగా లేదు. కోతులకు మెట్రో ట్రెయిన్ అంటే ఏం తెలుసు? అది ఎలా ట్రెయిన్ ఎక్కిందో తెలియదు కానీ.. అది ట్రెయిన్ ఎక్కగానే ట్రెయిన్ కూడా కదిలింది. దీంతో దానికి మెట్రో దిగే అవకాశం రాలేదు.

Monkey in Metro : మెట్రో స్టార్ట్ కాగానే అది చేసిన రచ్చ చూడండి

మెట్రో రైలు స్టార్ట్ కాగానే.. దానికి ఏం అర్థం కాలేదు. బయటికి వెళ్దామంటే అన్ని డోర్లు మూసుకొని ఉన్నాయి. ఆ మెట్రో ట్రెయిన్ లో ఉన్న ప్రయాణికుల్లో ఒకరు అది మెట్రోలో చేసిన రచ్చను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హడావుడి చేస్తోంది. మెట్రో రైలులో అటూ ఇటూ కాసేపు తిరిగిన కోతి.. చివరకు సీటు ఎక్కి ఓ ప్రయాణికుడి పక్కన కూర్చుంది. దీనికి సంబంధించిన వీడియోను మీరు కూడా చూసేయండి.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 28, 2021 at 11:38 ఉద.