Nayanatara : నయనతార సౌత్ సినిమా ఇండస్ట్రీలో అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలుగుతోంది. అటు తమిళంలో ఇటు తెలుగులో ఇప్పటికే స్టార్ హీరోలందరితోనూ భారీ ప్రాజెక్ట్స్ చేసింది. నయనతార చేసిన తెలుగు, తమిళ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ హిట్స్ సాధిస్తున్నాయి. దర్శక, నిర్మాతలకు, హీరోలకు లక్కీ హీరోయిన్‌గా మారిపోయింది. తెలుగులో జూనియర్ ఎన్.టి.ఆర్, ప్రభాస్, వెంకటేశ్, నాగార్జున, చిరంజీవి, ప్రభాస్ ఇలా దాదాపు అందరి సరసన నటించింది. వీరితో నటించిన సినిమాలన్నీ భారీ హిట్ సాధించాయి. అందుకే సీనియర్ హీరోలకి నయన్ మంచి ఛాయిస్ గా మారింది.

movie-promotions-are-not-entertained-by-nayanatara

అటు తమిళంలో రజనీకాంత్, అజిత్, విజయ్, సూర్య లాంటి స్టార్ హీరోలతో జతకట్టింది. ఇండస్ట్రీకొచ్చిన అతి కొద్ది కాలంలోనే భారీ రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్‌గా క్రేజ్ సంపాదించుకుంది. నయనతార రెమ్యూనరేషన్ తెలుగు, తమిళ పరిశ్రమలలో హాట్ టాపిక్ గా మారిన సందర్బాలు చాలానే ఉన్నాయి. సినిమా హిట్ ఫ్లాపులతో నయన్ కి సంబంధం లేకుండా మేకర్స్ తన డేట్స్ లాక్ చేసుకుంటున్నారు. ఇప్పటికీ తన చేతిలో క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకి నయనతార కేరాఫ్ అడ్రెస్.

Nayanatara : నయనతార మీద ఓ కంప్లైంట్ కూడా ఉంది.

ఇంత క్రేజ్ ఉన్న హీరోయిన్ మీద ఓ కంప్లైంట్ కూడా ఉంది. తను నటించిన సినిమాల విషయంలో ప్రమోషన్స్ కి దూరంగా ఉంటుందని. భారీ రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్ సినిమా ప్రమోషన్స్ కి హాజరయితే సినిమా మీద బాగా బజ్ క్రియేట్ అవుతుంది. కానీ నయన్ ఇందుకు దూరం. ఈ విషయంలో తన వద్ద సమాధానం కూడా ఉంది. ప్రారంభంలో ఓ సినిమా ప్రమోషన్స్ కి వస్తే ఆ సినిమా ఫ్లాప్ అయిందట. తన వల్ల సినిమాకి మైనస్ అవకూడదనే అప్పటి నుంచి ప్రమోషన్స్ కి రావడం మానేసినట్టు చెప్పుకొచ్చింది. కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం నయన్ ని మేకర్స్ కాంప్రమైజ్ చేయలేకపోతున్నారు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 10, 2021 at 8:11 సా.