mulberry tree leaks water during spring viral video
mulberry tree leaks water during spring viral video

Viral Video : ఈ సృష్టిలో ఎన్నో వింతలు, విచిత్రాలు జరుగుతుంటాయి. అవన్నీ మనం చూసి ఆశ్చర్యపోతుంటాం. కొన్ని మన ఊహకే అందవు. అసలు.. ఇది ఎలా జరుగుతోంది? అని ఆశ్చర్యపోతుంటాం. కొన్ని అంతే మనకు అంతుపట్టవు. మనిషికి అర్థం కావు. వాటిని అలా చూస్తూ ఉండటం తప్పితే మనం చేసేది ఏం ఉండదు. మన ఊహకు అందని ఎన్నో విచిత్రాలు రోజూ ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉంటాయి. తాజాగా అలాంటి వింత ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఈ వీడియో చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఇంతకీ ఏంటా వీడియో? ఏంటా విచిత్రం అంటారా?

mulberry tree leaks water during spring viral video
mulberry tree leaks water during spring viral video

ఒక చెట్టు నుంచి నీళ్లు కారుతున్నాయి. అవి కూడా బోరు పోసినట్టుగా నీళ్లు తెగ ఉబికి వస్తున్నాయి. ఏదో కొంత సేపు వచ్చి పోయినా పెద్దగా ఎవ్వరూ పట్టించుకునేవారు కాదు. కానీ.. నిరంతరంగా మంచి నీళ్ల బోరు పోసినట్టే.. నీళ్లు ఉబికి వస్తుంటే ఎవ్వరైనా చూసి షాక్ కావాల్సిందే. ఆశ్చర్యపోవాల్సిందే. చెట్టులో నుంచి వస్తున్న నీళ్లను చూసి చాలా మంది నోరెళ్లబెట్టారు. కానీ.. ఆ చెట్టు తొర్రలో నుంచి ఇలా నీళ్లు రావడం ఇదే మొదటి సారి ఏం కాదు. ఎందుకంటే.. ఆ చెట్టుకు ఓ చరిత్ర ఉంది. దానికి ఓ కథ ఉంది.

Viral Video : ప్రతి వానాకాలం సీజన్ లో ఆ చెట్టులో నుంచి నీళ్లు

నిజానికి ఆ చెట్టు పేరు మల్ బరీ ట్రీ. అది మాంటెనెగ్రో అనే దేశంలో ఉంది. అక్కడ వర్షాకాలం సీజన్ వస్తే చాలు.. అక్కడ కురిసిన వర్షాలకు గ్రౌండ్ వాటర్ బాగా పెరిగిపోతుందట. అప్పుడు నీళ్లు బాగా పైకి ఉబికి వస్తుంటాయట. ఆ మల్ బరీ ట్రీ తన వేర్ల సాయంతో.. నీటిని పైకి లాక్కొని ఇలా తన చెట్టు తొర్రలో నుంచి బయటికి పంపిస్తుందట. ఇలా ప్రతి సంవత్సరం జరుగుతుందట. అసలు.. బోరు పోసినట్టే నీళ్లు కంటిన్యూగా వస్తుండటాన్ని చూసి అక్కడి స్థానికులు తెగ ఆశ్చర్యపోతున్నారు. ఇక.. ఆ చెట్టు తొర్రలో నుంచి వస్తున్న నీళ్లను అక్కడి వాసులు తాగుతారట. అవి అంత స్వచ్ఛంగా ఉంటాయట. అది అసలు కథ. మొత్తానికి ఈ చెట్టుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా చూసేయండి.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 23, 2021 at 1:14 సా.