Gopichand : యాక్షన్ హీరో గోపీచంద్ – యాంగ్రీ హీరో డాక్టర్ రాజశేఖర్ హీరోలుగా మల్టీస్టారర్ తెరకెక్కబోతుంది. శ్రీవాస్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. అన్నదమ్ముల మధ్య సాగే ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కబోతుండగా పాన్ ఇండియన్ సినిమాగా రూపొందబోతోంది. బిజినెస్ మాన్ ఈ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇప్ప‌టికే ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు మొద‌ల‌య్యాయి. కొవిడ్ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డిన త‌ర్వాత సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. త్వరలో ఇతర నటీ నటులు.. టెక్నీషియన్స్ వివరాలు వెల్లడి కానున్నాయని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.

multi-starer-movie-with-gopichand-rajashekar-combination

Gopichand : గోపీచంద్ మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ తెరకెక్కుతోంది.

కాగా గోపీచంద్ తమన్నా జంటగా సీటీమార్ సినిమా తెరకెక్కింది. రిలీజ్‌కు రెడీగా ఉన్న ఈ సినిమాకు సంపత్ నంది దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ తెరకెక్కుతోంది. రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత గోపీచంద్ చేయబోతున్న మల్టీస్టారర్ సినిమా రాజశేఖర్‌తోనే. ఇక రాజశేఖర్ డిఫ్రెంట్ జోనర్‌లో తెరకెక్కుతున్న రెండు సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాలకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజై సినిమా మీద అంచనాలు పెంచాయి.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on మే 12, 2021 at 7:23 సా.