Naga Chaitanya: సమంత, నాగచైతన్య గత కొద్ది రోజులుగా వీరిద్దరి పేర్లు మళ్లీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. కాగా గత ఏడాది ఈ జంట విడాకులు తీసుకుని విడిపోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే విడాకుల ముందు వరకు ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఒక్కసారిగా విరాకులు తీసుకుని విడిపోతున్నట్లు ప్రకటించడంతో అభిమానులు షాక్ అయ్యారు. అయితే వీరిద్దరి విడాకులు తీసుకొని దాదాపు పది నెలలు కావస్తున్నా కూడా వీరిద్దరికి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. కాగా విడాకుల తర్వాత కొద్ది నెలల పాటు సోషల్ మీడియాలో మారుమోగిపోయిన ఈ జంట పేర్లు కొద్దిరోజుల పాటు సోషల్ మీడియాలో వినిపించకపోయినా మళ్లీ ఈ మధ్యకాలంలో వీరి పేర్లు తెగ వైరల్ అవుతున్నాయి.
ఇది ఇలా ఉంటే తాజాగా నాగచైతన్య సమంత పేర్లు మరొకసారి సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అయితే ఈ జంట విడాకులు తీసుకొని విడిపోవడానికి గల అసలు కారణం ఏంటి అనేది ఇప్పటికీ ఎవరికి తెలియదు. విడాకుల తరువాత ఈ జంట ఎక్కడ కూడా వారి విడాకుల సంబంధించిన విషయాల గురించి స్పందించలేదు. కానీ తాజాగా నాగచైతన్య లాల్ సింగ్ చద్దా ప్రమోషన్స్ లో విడాకుల విషయం పై నోరు మెదిపాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్య ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ తనకు సమంత పై ఇప్పటికీ గౌరవం ఉంది అని తెలిపారు. ఇంటర్వ్యూలో భాగంగా సమంత గురించి ఒక ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. కొత్తగా సమంతపై తనకున్న అభిప్రాయం ఏంటి అని సదరు యాంకర్ అడగగా ఆ విషయం పై స్పందించిన నాగచైతన్య..
Naga Chaitanya: సమంత అంటే ఇప్పటికీ గౌరవం ఉంది..
సమంత అంటే ఇప్పటికి తనకు అమితమైన గౌరవం ఉందని, సమంత పై ఉన్న గౌరవం ఎప్పటికీ పోదని తెలిపారు. అదేవిధంగా ఇద్దరూ ఒక అండర్ స్టాండింగ్ తోనే విడాకులు తీసుకొని విడిపోయినట్లు తెలిపాడు నాగచైతన్య. అయితే విడాకులు తీసుకొని విడిపోయిన సమయంలో కూడా వారికి ఒకరంటే ఒకరికి రెస్పెక్ట్ ఉందని, వారి మధ్య ఏం జరిగిందో అదే తెలిపాము అని చెప్పుకొచ్చాడు నాగ చైతన్య. కానీ కొంతమంది మాత్రం వారి మధ్య ఏదో జరిగింది అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారని, విడాకులు తీసుకుని విడిపోయిన మొదట్లో అయితే సోషల్ మీడియాలో వారిపై వినిపించిన వార్తలకు చాలా విసుగు చెందాడట నాగచైతన్య. కాగా లాల్ సింగ్ చద్దా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగ చైతన్య చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.