Naga chaithanya : నాగార్జున కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేయడానికి ఎప్పుడూ ముందుంటాడు. ఆయన బ్యానర్ అయిన అన్నపూర్ణ సంస్థలో ఎందరో కొత్త దర్శకులకి నాగార్జున అవకాశం ఇచ్చాడు. సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ ఈ రోజు ఈ స్థాయికి రావడానికి కారణం నాగార్జుననే. కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ కూడా ఈ బ్యానర్ నుంచే దర్శకుడిగా మారాడు. ఇటీవల నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ సినిమాకి కూడా దర్శకుడు కొత్తవాడే. అహిషోర్ సోలొమెన్ వైల్డ్ డాగ్ తో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.

ఇలా నాగార్జున ఎంతో మంది కొత్త దర్శకులకి లైఫ్ ఇచ్చాడు. అక్కినేని నాగేశ్వర రావు గారు కూడా అప్పట్లో కొత్తవారిని టాలీవుడ్ కి పరిచయం చేశారు. ప్రముఖ దర్శకులు కె.విశ్వనాథ్ గారికి మొదటి సినిమా దర్శకుడిగా అవకాశం ఇచ్చింది నాగేశ్వర రావు గారే. ఆ రోజు ఆయన అవకాశం ఇవ్వకపోయి ఉంటే కళాతపస్వి గా ఆయనకంటు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకునేవారు కాదేమో. అయినా అందుకు కారణం మరొకరు అయి ఉండేవారు. ఇలా అప్పట్లో నాగేశ్వర రావు, ఈ జనరేషన్ లో నాగార్జున కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు.
Naga chaithanya : ఆ సమయంలో కాస్త చైతూ మానసికంగా డిస్ట్రబ్ అయ్యాడు.
కానీ యంగ్ హీరో అక్కినేని వారసుడు నాగ చైతన్య మాత్రం కొత్త దర్శకుడికి అవకాశం ఇవ్వడానికి ససేమిరా అంటున్నాడు. అందుకు కారణం అజయ్ భుయాన్. ఈ దర్శకుడితో దడ అనే సినిమా చేశాడు నాగ చైతన్య. డెబ్యూ డైరెక్టర్ అని అవకాశం ఇచ్చాడు. కానీ ఆయన చైతుకి హిట్ ఇవ్వలేకపోయాడు. భారీ డిజాస్టర్ ఇచ్చాడు. ఆ సమయంలో కాస్త చైతూ మానసికంగా డిస్ట్రబ్ అయ్యాడు. అందుకే అప్పటి నుంచి నాగ చైతన్య కొత్త దర్శకులకి అవకాశం ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. మరి రానున్న రోజుల్లోనైనా కొత్త వారికి అవకాశం ఇస్తాడేమో చూడాలి.