Nagababu : మెగాస్టార్ చిరంజీవి నటించిన ఒక ప్రయోగాత్మక సినిమా రుద్రవీణ. ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు సంచలనాలు సృష్ఠిస్తాయి. అనుకోని విజయాలు అందుకుంటాయి. ఊహించని విధంగా అవార్డులు, రివార్డులు దక్కించుకుంటాయి. అయితే ఫ్లాప్ అయిన సినిమాలకి జాతీయ, నంది అవార్డులు దక్కాయంటే ఆ సినిమా కథా నేపథ్యానికి ఉన్న ప్రాధాన్యం ఎంతటిదో తెలుస్తోంది. కమర్షియల్ హీరోగా చిరంజీవి మంచి ఫాంలో ఉన్నారు. అప్పటికే సుప్రీం హీరో, సూపర్ స్టార్ నుంచి మెగాస్టార్ చిరంజీవిగా అవతరించాడు. దేశవ్యాప్తంగా మెగాస్టార్ సినిమాలకి విపరీతమైన ఆదరణ దక్కుతోంది.

nagababu-as a producer for rudraveena
nagababu-as a producer for rudraveena

ఆయన సినిమా రిలీజైందంటే ఆంధ్ర రాష్ట్రమంతటా థియేటర్స్ జన సందోహంతో నిండిపోతున్నాయి. భారీ కమర్షియల్ విజయాలను అందుకుంటూ స్టార్‌గా టాలీవుడ్‌లో సత్తా చాటుతున్నారు. అప్పుడే తమ్ముడు నాగబాబుని నిర్మాత చేయాలనే ఆలోచన కలిగింది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన నాగబాబు అల్లు అరవింద్ నిర్మాణ సంస్థలో నిర్మాణం కి సంబంధించి పనులు చూసుకుంటున్నాడు. కాస్త అనుభవం కూడా రావడంతో తమ్ముడికి సొంత నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు చిరంజీవి. తల్లిగారు పేరైన అంజనా ప్రొడక్షన్స్ పేరుతో ప్రొడక్షన్స్ హౌజ్ ని మొదలు పెట్టి మంచి క్లాసిక్ తీయాలని ప్లాన్ చేశారు.

Nagababu : ఇళయరాజా ఇచ్చిన పాటలన్నీ సూపర్ హిట్

ప్రముఖ దర్శకులు కె బాలచందర్ దర్శకత్వంలో చిరంజీవి – శోభన జంటగా సంగీతం ప్రధానంగా రుద్రవీణ తెరకెక్కించారు. సినిమాలో ఇళయరాజా ఇచ్చిన పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. నేపథ్య సంగీతం బాగుంది. ప్రముఖ నటుడు జెమినీ గణేశన్ చిరంజీవి తండ్రిగా నటించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమా ఫ్లాప్ గా మిగిలింది. అయితే ఉత్తమ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో – జాతీయ సమైక్యత చిత్రంగా అవార్డ్ దక్కించుకుంది. అలాగే ఉత్తమ నటుడుగా చిరంజీవికి నంది అవార్డ్ దక్కింది. అంతేకాదు భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ సంగీత దర్శకుడుగా ఇళయరాజాకి, ఉత్తమ గాయకుడిగా ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యంకి అవార్డులు దక్కాయి. ఈ సినిమాలోని తరలి రాదా తనే వసంతం.. తన దరికిరాని వనాలకోసం, లలిత ప్రియ కమలం విరిసినది.. అనే పాటలు ఇప్పటికీ వినిపిస్తుంటాయి.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 27, 2021 at 5:03 సా.