Nagababu : కూతురిని కంట్రోల్ లో పెట్టుకోలేవా అంటూ నాగ బాబు పై ఫైర్ అయిన శ్వేత రెడ్డి….!

Joythi R

Nagababu : ఇటీవలే హైదరాబాద్ నగర పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఫుడ్డింగ్ పబ్ లో జరిగిన డ్రగ్స్ వ్యవహారం తీవ్రంగా కలకలం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ డ్రగ్స్ వ్యవహారంలో సినీ ప్రముఖులు మరియు రాజకీయ నాయకులు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కి చెందినటువంటి పెద్దల పిల్లలు ఉండటంతో గుట్టు చప్పుడు కాకుండా రైడ్ లో దొరికినటువంటి వారిని పోలీసులు కేవలం కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించేశారు. దీంతో ఈ విషయంపై కొందరు ప్రతిపక్ష నాయకులు స్పందిస్తూ గగ్గోలు పెడుతున్నారు. అయితే తాజాగా ఈ ఘటనపై బిజెపి పార్టీ నాయకురాలు శ్వేతా రెడ్డి తన అధికారిక సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా స్పందించింది.

ఇందులో భాగంగా గతంలో మాదక ద్రవ్యాల నిషేధంపై మెగాస్టార్ చిరంజీవి నిర్వహించిన ఓ క్యాంపెయిన్ గుర్తు చేస్తూ ఇలాంటి నీతులు ఎదుటి వాళ్ళకి చెప్పేముందు తమ ఇంట్లో పిల్లలకి చెప్పి కంట్రోల్ చేస్తే బాగుంటుందని ఘాటుగా విమర్శలు చేసింది. అంతటితో ఆగకుండా నాగబాబు కూడా ఈ మధ్యకాలంలో బహిరంగ సభలలో రెచ్చిపోతున్నాడని కానీ బహిరంగ సభలో ఇచ్చే స్పీచ్ లు తన ఇంట్లో వాళ్లకి ఇస్తే కొంచెం బాగుంటుందని పరోక్షంగా ఎద్దేవా చేసింది. మరోవైపు జనసేన పార్టీ సైనికులను కూడా ఉద్దేశించి ఘాటుగా విమర్శలు చేసింది ఇందులో ముఖ్యంగా కొందరు ఆడవాళ్లపై జనసేన పార్టీ సైనికులు నిజానిజాలు తెలుసుకోకుండా రోలింగ్ చేయడం మరియు అసభ్యకర వార్తలు ప్రచారం చేయడం వంటివి చేస్తున్నారని మరి ఇప్పుడు నిహారిక విషయంలో ఏం చేస్తారో చూడాలంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

అలాగే ఇతర మహిళలను విమర్శించే ముందు తమ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారనే విషయాన్ని జనసేన పార్టీ సైనికులు గుర్తు పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చింది. మరోవైపు ఈ మధ్యకాలంలో కొందరు డబ్బు మదం తో ఎలాంటి తప్పులు చేసినా సరే ఇట్టి తప్పించుకోవచ్చనే భ్రమలో బతుకుతున్నారని ఇలాంటివాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక రోజు శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొంది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా నటి శ్వేతా రెడ్డి నిహారిక విషయంలో చేసిన వ్యాఖ్యలపై కొందరు పవన్ కళ్యాణ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పబ్బులో నిహారిక కొణిదెల డ్రగ్స్ తీసుకున్నట్లు ఇంకా నిర్ధారణ కాలేదని అలాంటప్పుడు నిజానిజాలు తెలుసుకోకుండా మహిళపై ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని శ్వేతా రెడ్డి చూసి సూచిస్తున్నారు. మరికొందరు మాత్రం ఈ మధ్యకాలంలో శ్వేతా రెడ్డికి మతి భ్రమించిందని అందువల్లనే అప్పుడప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందంటూ ఫైర్ అవుతున్నారు.

- Advertisement -