Srinuvaitla : టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా ఒక వెలుగు వెలిగాడు శ్రీనువైట్ల. మొదటి సినిమా నీకోసం. రవితేజ హీరోగా నటించిన ఈ సినిమాలో మహేశ్వరి హీరోయిన్. ఆర్.పి.పట్నాయక్ సంగీత దర్శకుడిగా మొదటి సినిమా. చాలా కష్టపడి శ్రీనువైట్ల ఈ సినిమా తీశాడు. మ్యూజికల్ గా మంచి హిట్. అయితే సినిమాకి ఫైనల్ గా మాత్రం ఫ్లాప్ అని ముద్ర పడింది. కానీ ఈ సినిమా అందరి తలరాతలు మార్చేసింది. ముఖ్యంగా శ్రీనువైట్ల కి ఈ సినిమా మరొక జీవుతాన్నిచ్చింది. అది ఇచ్చింది అక్కినేని నాగార్జున. నీకోసం సినిమా చూసిన నాగార్జున కామెడి తగ్గింది..ఆ ఒక్కటి గనక ఉంటే సినిమా సూపర్ హిట్ అయ్యేది.

nagarjuna suggested srinuvaitla-in a correct way

నెక్స్ట్ సినిమా నుంచి కామెడి ట్రాక్ ఉండేలా చూడు టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ అవుతావు. నీకు నేను సినిమా ఇస్తానని మాటిచ్చాడు. నాగార్జున సలహా పాటించిన శ్రీనువైట్ల రెండవ సినిమాగా ఆనందం తెరకెక్కించాడు. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ లో ప్రముఖ నిర్మాత రామోజీ రావు నిర్మించాడు. పెట్టిన పెట్టుబడి కంటే నాలుగు రెట్లు లాభాలు తెచ్చిపెట్టింది. ఈ సినిమా ఒక సెన్షేషన్ ని క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఇందులో ఉన్న కామెడి ట్రాక్ శ్రీనువైట్ల లైఫ్ ని మార్చేసింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసే అవకాశాలు అందుకున్నాడు.

Srinuvaitla : ఈసారైనా హిట్ దక్కి మళ్ళీ ఫాంలోకి వస్తాడో లేదో.

అదికూడా స్టార్ హీరోలందరితోనూ. మెగాస్టార్ చిరంజీవితో అందరివాడు, నాగార్జునతో కింగ్, వెంకటేశ్‌తో నమో వెంకటేశా, రవితేజతో కృష్ణ, మహేష్ బాబుతో దూకుడు, ఆగడు, ఎన్.టి.ఆర్ తో బాద్‌షా, రాం చరణ్ తో బ్రూస్‌లీ, మంచు విష్ణుతో ఢీ లాంటి బ్లాక్ బస్టర్స్ తీశాడు. ఈ డైరెక్టర్ ఇచ్చిన హిట్స్ తో టాలీవుడ్ హీరోలందరు అవకాశాలిచ్చారు. అయితే మహేష్ తో తీసిన ఆగడు భారీ డిజాస్టర్ కావడంతో మళ్ళీ ఇప్పటి వరకు హిట్ అందుకోలేకపోయాడు. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ మంచు మనోజ్ తో ఢీ సీక్వెల్ తీస్తున్నాడు. ఆ సినిమా కంటే డబుల్ ఎంటర్‌టైన్మెంట్ ఇస్తామని హీరో దర్శకుడు గట్టి నమ్మకంగా చెబుతున్నారు. చూడాలి మరి ఈసారైనా హిట్ దక్కి మళ్ళీ ఫాంలోకి వస్తాడో లేదో.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 17, 2021 at 8:18 సా.