Balakrishna : గాడిద అంటూ రిపోర్టర్ పై రెచ్చిపోయిన బాలయ్య.. కారణమేంటో తెలిస్తే నవ్వు ఆపుకోలేరు !

Bharath Cine Desk

Balakrishna : నందమూరి నటసింహం బాలకృష్ణ…. ఆరు పదులు దాటిన వరుసగా సినిమాలు చేస్తూ.. బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇప్పటిదాకా వెండితెరలోనే సత్తా చాటిన బాలయ్య ఇటీవలే ఆన్ స్టాప్ బుల్ విత్ ఎన్.బి.కె అనే ఓటిటి షో తో బుల్లితెరపైకి హోస్ట్ గా కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఈ మేరకు షో ని బాలయ్య సక్సెస్ ఫుల్ గా నడిపిస్తున్నాడు. బాలయ్య తన యాటిట్యూడ్ కు భిన్నంగా, ఎంతో ఫ్రీ స్పిరిట్ తో చేస్తున్న ఈ టాక్ షో, చాలా పెద్ద సూపర్ హిట్ అయ్యింది. ప్రతి వారం ఈ షోలో ఎవరు గెస్ట్‌గా వస్తారా అని ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన అఖండ చిత్రం ఎంత ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా, జగపతిబాబు, శ్రీకాంత్‌, పూర్ణ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. అఖండ సినిమా అంత హిట్ కావడానికి తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఒక కారణమని చెప్పవచ్చు. సినిమా భారీ అంచనాల నడుమ గతేడాది డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి వసూళ్లను రాబట్టింది. ఈ మధ్య కాలంలో ఎన్నడూ చూడని ప్రభంజనం ఇది. ముఖ్యంగా బాలయ్య పని అయిపోయింది అనుకున్న వాళ్ళకు ఈ సినిమాతో దిమ్మ తిరిగిపోయేలా సమాధానం ఇచ్చారు.

నేడు నట సార్వభౌముడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 26వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలకృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మొదట విలేకరులతో మాట్లాడే ముందు బాలయ్య అందరూ వ్యక్తిగత దూరం పాటించాలని అనగా ఓ విలేకరి దానికి సామాజిక దూరం పాటించాలని చెప్పాడు. దానికి బాలయ్య ‘గాడిద.. సామాజిక ఏంటి ! వ్యక్తిగత ‘ అంటూ రిపోర్టర్ పై రెచ్చిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.

 

- Advertisement -