Nandamuri Balayya: టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక నటుడుగా ఎంత పేరు సంపాదించుకున్నాడో వ్యక్తిగతంగా కూడా అంతే మంచి పేరు సంపాదించుకున్నాడు. ఈయనకు తెలుగు రాష్ట్రాలలో మంచి అభిమానం ఉంది. ఎన్నో సినిమాలలో నటించిన ఈయన స్టార్ హీరోగా ఎదిగాడు.
ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు. యంగ్ హీరోలతో పోటీ గా వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంటున్నాడు. ఒక సినిమా షూటింగ్ బిజీలో ఉండగానే మరో సినిమాకు సైన్ చేస్తున్నాడు బాలయ్య. ఇటీవలే అఖండ సినిమాతో కెరీర్ పరంగా సెన్సేషనల్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. అఖండ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి భారీ వసూళ్లు సొంతం చేసుకుంది.
ఇక బాలయ్య వ్యాఖ్యాతగా కూడా మంచి రెస్పాన్స్ అందుకుంటున్నాడు. తెలుగు ఓటీటీ వేదికగా ఆహా లో ప్రసారమవుతున్న ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్ బీకే’ అనే షో లో హోస్ట్ గా చేశాడు. ఈ షోకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. పైగా బాలయ్యకు వ్యాఖ్యాతగా మంచి ప్రశంసల వర్షం కూడా కురిపించారు జనాలు. ఇక ఈ షోకు బాలయ్య కేవలం రెండున్నర కోట్లు మాత్రమే పారితోషకంగా తీసుకున్నాడు.
Nandamuri Balayya: ముందు రెండు కోట్లు.. కానీ ఇప్పుడు 5 నుంచి 6 కోట్లు!
ఇక సీజన్ 2 కూడా ఉండటంతో అందులో బాలయ్య భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసే అవకాశం ఉందని టాక్ నడుస్తుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న బాలయ్య మధ్యలో ఈ షోకు డేట్లు కేటాయించారు.. దీంతో ఈ షో కోసం 5 నుంచి 6 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.
ఇక బాలయ్య అఖండ సినిమా తర్వాత మరో సినిమాలో బిజీ గా మారాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు బాలయ్య. అంతేకాకుండా అనిల్ రావిపూడి దర్శకత్వంలో కూడా మరో సినిమాకు సైన్ చేశాడు. వెంకీ అట్లూరితో పాటు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ తో పాటు దిల్ రాజు బ్యానర్ లో కూడా వరుస సినిమాలకు సైన్ చేశాడని తెలుస్తుంది.