Nayanatara : మెగాస్టార్ చిరంజీవి సరసన నటించాలని ప్రతీ జూనియర్ నుంచి సీనియర్ హీరోయిన్స్ ఎంతో ఆసక్తి చూపిస్తారనే విషయం అందరికీ తెలిసిందే. ఖైదీ
నంబర్ 150 మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ వరుసగా యంగ్ డైరెక్టర్స్ కి అవకాశాలిస్తున్నారు. అంతేకాదు తన ఏజ్‌కి తగ్గట్టు హీరోయిన్స్ ని కూడా సీనియర్ అండ్ క్రేజీ స్టార్ హీరోయిన్స్ నే తీసుకుంటున్నారు. మెగాస్టార్ కథ విన్నప్పుడే హీరోయిన్ ఎవరైతే ఆయన సరసన సూటవుతారో ఆమెని తీసుకోమని దర్శక నిర్మాతలకి సూచిస్తుంటారు. ఇప్పుడు కూడా ఆయన నటించబోతున్న లేటెస్ట్ సినిమాలో ఓ సీనియర్ హీరోయిన్‌ని తీసుకోమని సలహా ఇచ్చారాట. అది కూడా ఆయనకి జంటగా ఓ సారి నటించిన హీరోయిన్.

Nayanatara Senior heroine ready for romance with megastar once again ..!
Nayanatara Senior heroine ready for romance with megastar once again ..!

 

ఆమెవరో కాదు సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార. ఈమెకి ప్రస్తుతం అటు తమిళంలో ఇటు తెలుగులో భారీ ప్రాజెక్ట్స్ చేస్తూ చాలా బిజీగా ఉంది. అగ్ర కథానాయకులకి ప్రస్తుతం నయనతార మంచి జోడీగా కనిపిస్తోంది. తమిళంలో ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ‘అన్నాతే’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మరో తమిళ సినిమాతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో బెస్ట్ ఆప్షన్ గా మారింది. ఇదే క్రమంలో ఈమెకి మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న మలయాళ సూపర్ హిట్ ‘లూసీఫర్’ తెలుగు రీమేక్
కోసం స్వయంగా నయనతార పేరును మెగాస్టార్ సూచించారట.

Nayanatara : నయనతారను సంప్రదించారట.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

నయనతార ఇప్పటికే చిరంజీవితో ‘సైరా నరసింహా రెడ్డి’ సినిమాలో నటించారు. ఈ సినిమాలో ఎంతో హుందాతనమైన పాత్రలో కనిపిచి ఎంతగానో ఆకట్టుకుంది. అంతేకాదు చిరంజీవికి పెయిర్ గా నయనతార చాలా పర్ఫెక్ట్ గా సూటయిందని ఇండస్ట్రీలో చెప్పుకున్నారు. అందుకే తననే మరోసారి తీసుకుందామనుకుంటున్నట్టు లేటెస్ట్ న్యూస్. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కోసం నయనతారను సంప్రదించారట కూడా. ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అసలే మెగాస్టార్ సినిమా ..అందులోనూ ఆల్రెడీ బ్లాక్ బస్టర్ మూవీ. అందుకే ఒకే చెప్పినట్టు తెలుస్తోంది. ఈ మూవీకి తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహించబోతున్నాడు. మెగా సూపర్ గుడ్ ఫిలింస్, కొణిదెల ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్నాయి.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూలై 25, 2021 at 7:41 సా.