Neetu Singh భర్త చనిపోయాడని బాధ లేకుండా ఎంజాయ్ చేస్తుందంటూ స్టార్ హీరోయిన్ ని ట్రోలింగ్….

Joythi R

Neetu Singh బాలీవుడ్ చలన చిత్ర పరిశ్రమలో కొన్ని వందల చిత్రాలలో హీరోగా ప్రతినాయకుడిగా మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ నటుడు రిషి కపూర్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. కాగా నటుడు రిషి కపూర్ కేవలం నటనతో మాత్రమే కాకుండా కొన్ని చిత్రాలకు నిర్మాతగా సహా నిర్మాతగా కూడా వ్యవహరించారు బాగానే సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. అయితే నటుడు రిషి కపూర్ 1980వ సంవత్సరంలో బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ నీతూ కపూర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరి కుమారుడైన రణబీర్ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ లో తిరుగులేని స్టార్ గా దూసుకుపోతున్నాడు.

అయితే రిషి కపూర్ 2 సంవత్సరాల క్రితం కేన్సర్ వ్యాధితో మృతి చెందిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో కొందరు తన భర్త చనిపోయిన తర్వాత ఏమాత్రం బాధ లేకుండా టూర్లు పార్టీలు అంటూ ఎంజాయ్ చేస్తున్నానని తెగ ట్రోల్ చేశారని నీతూ కపూర్ కొంతమేర ఎమోషనల్ అయ్యింది. అలాగే కొందరు తానూ బాధ పడతుంటే చూడాలని తెగ కోరుకుంటున్నారని అలాంటి వాళ్ళని నేను పెద్దగా పట్టించుకోనని సపష్టం చేసింది. అంతేగాక నన్ను ఇంస్తాగ్రాంలో ప్రేమించేవాళ్ళు ఉన్నారని ఇప్పుడు నేను బాధ పడతూ ఉంటె నా ఫ్యాన్స్ మరియు ఫాలోవర్స్ చాలా బాధ పడతారని కాబట్టి వాళ్ళు బాధ పడకుండా ఉండాలంటే నేను హ్యాపి గా ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేసింది. అలాగే ఒక వ్యక్తి చనిపోయినతర్వాత బాధ పడినంత మాత్రాన ఆ వ్యక్తి పై ప్రేమ ఉన్నట్లు కాదని అలాగే బాధ పడకపోయినా ప్రేమలేనట్లు కాదని తెలిపింది. నా భర్తని ప్రాణం ఉన్నంతకాలం ప్రేమిస్తూనే ఉంటానని అలాగే నా భర్త స్థానంలో మరొకరికి ఏమాత్రం స్థానం లేదని స్పష్టం చేసింది.

ఈ విషయం ఇలా ఉండగా నటి నీతూ కపూర్ అప్పట్లో దాదాపు గా అందరి స్టార్ హీరోలతో కలసి నటించింది. అలాగే రిషి కపూర్ తో కల్సి పలు చిత్రాల్లో నటించింది. దీంతో వీరిద్దరూ కలసి నటిస్తున్న సమయంలో ప్రేమలో పడ్డారు. దాంతో ఇరువురి కుటుంభ సభ్యులు పెళ్ళికి అంగీకరించడంతో పెళ్లి చేసుకున్నారు. ఐతే పెళ్ళయిన తర్వాత నటి నీతూ కపూర్ సినిమాల్లో నటించడం పూర్తిగా మానేసింది. అలాగే కుటుంభ బాధ్యతలను చక్కబెట్టె పనిలో పడి బిజీబిజీగా గడిపిన నటి నీతూ కపూర్ చాలా ఏళ్ళ తర్వాత రీసెంట్ గా ఓ రియాల్టీ షోలో కనిపించింది.

- Advertisement -