Niharika: మెగా వారసురాలు నిహారిక కొణిదెల ప్రస్తుతం నటనకు దూరంగా ఉంటూ నిర్మాతగా మారింది. పింక్ ఎలిఫెంట్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించిన నిహారిక ఇటీవల కొత్త ఆఫీస్ కూడా ప్రారంభించింది. మొదట నటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నిహారిక పలు సినిమాలలో హీరోయిన్ గా నటించింది. అయితే హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోవటంతో పెళ్లి చేసుకొని భర్త సహాయంతో నిర్మాతగా మారింది. ప్రస్తుతం వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ బిజీగా ఉంది. ఇదిలా ఉండగా గత కొంతకాలంగా నిహారిక విడాకుల వార్తలు వైరల్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా సోషల్ మీడియాలో నిహారిక షేర్ చేసిన ఒక పోస్టు వల్ల ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.
నిహారిక జొన్నలగడ్డ వెంకట చైతన్యని పెద్దల అంగీకారంతో వివాహం చేసుకుంది. వీరి వివాహ వేడుక రాజస్థాన్ లో అంగరంగ వైభవంగా జరిగింది. వివాహం జరిగిన కొత్త కాలం వరకు వీరిద్దరూ కూడా ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. అయితే కొన్ని రోజులుగా నిహారికకి చైతన్యతో మనస్పర్ధలు వచ్చాయని అందువల్ల వారిద్దరూ విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా ఇటీవల ఇంస్టాగ్రామ్ లో భర్తతో కలిసి ఉన్న ఫోటోలను నిహారిక డిలీట్ చేసింది. చైతన్య కూడా నిహారికతో ఉన్న ఫోటోలు డిలీట్ చేయడమే కాకుండా ఆమెను అన్ ఫాలో చేశాడు. దీంతో వీరి విడాకుల వార్తలకు మరింత బలం చేకూరింది.
Niharika: విడాకుల వార్తలు నిజమేనా…
ఇదిలా ఉండగా ఇటీవల ప్రముఖ ఫోటోగ్రాఫర్ అరీఫ్ పుట్టినరోజు సందర్భంగా నిహారిక విషెస్ చెబుతూ ఇంస్టాగ్రామ్ లో రీల్ పోస్ట్ చేసింది. అరిఫ్ తో దిగిన ఫోటోని షేర్ చేస్తూ యు ఆర్ వెరీ స్పెషల్ అంటూ ఫోటోగ్రాఫర్ కి స్పెషల్ విశేష్ తెలియజేసింది. దీంతో ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. అయితే ఫోటోగ్రాఫర్ బర్త్డే సందర్భంగా నిహారిక ఇలా స్పెషల్ విషెస్ చెప్పడంతో వీరి విడాకుల వార్తలు మరింత జోరుగా ప్రచారం జరుగుతున్నాయి.