Shyam singh roy : శ్యామ్ సింగ రాయ్.. నేచురల్ స్టార్ నాని, సాయిపల్లవి, కృతి శెట్టి హీరో హీరోయిన్స్‌గా నటిస్తున్న లేటెస్ట్ సినిమా. ఈ సినిమా నుంచి తాజాగా సాయి పల్లవి లుక్ రిలీజయింది. సాయి పల్లవి కథల ఎంపిక ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఫిదా సినిమాలో తను చెప్పిన భానుమతి ఒక్కటే పీస్ అన్న మాదిరిగా తనలాంటి పాత్రలు తను మాత్రమే పోషిస్తుందని తాజాగా రిలీజయిన పోస్టర్ ద్వారా అర్థమవుతోంది. తనకు ఎలాంటి పాత్రలు నప్పుతాయో అలాంటి పాత్రలతో పాటు తన మేనరిజానికి సూటయ్యే పాత్రలను సినిమాలను ఎంచుకుంటోంది.

no-one-ever-seen-shyam-singh-roy-sai-pallavi-like-this
no-one-ever-seen-shyam-singh-roy-sai-pallavi-like-this

సాయి పల్లవి ఒక పాత్ర ఎంపిక నుండి ఆ పాత్రలో పరకాయప్రవేశం చేసి సినిమాకు వందకు వంద శాతం న్యాయం చేయడం వరకు అన్నీ రకాలుగా శ్రమిస్తుంటుందని తను ఇటీవల నటిస్తున్న సినిమాల మేకింగ్ వీడియోస్ చూస్తే అర్థమవుతుంది. కాగా సాయిపల్లవి ప్రస్తుతం నేచురల్ స్టార్ నానికి జోడిగా నటిస్తున్న ’శ్యామ్ సింగ రాయ్‘ సినిమాలో నుంచి తన బర్త్ డే సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ కి విశేషంగా స్పందన లభిస్తోంది. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మ‌డోన్నా సెబాస్టియ‌న్ మూడవ హీరోయిన్ గా కనిపించబోతోంది.

Shyam singh roy : సాయి ప‌ల్ల‌వి అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

ఇక తాజాగా రిలీజైన సాయి పల్లవి లుక్ గమనిస్తే సాంప్రదాయ బెంగాలీ చీరకట్టు ముక్కుకు ముక్కెర, నుదుటన పెద్ద కుంకుమ బొట్టు, కణకణ మండుతున్న శూలం చేతిలో పట్టి కాళికాదేవి అవ‌తారంలో ఎంతో గంభీరంగా ఉగ్ర‌రూపం దాల్చిన‌ట్టుగా ఉంది. ఈ లుక్ సాయి ప‌ల్ల‌వి అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమా కోసం ఏకంగా హైదరాబాద్ లో 10 ఎకరాల స్థలంలో భారీ కోల్కతా సెట్ నిర్మించి షూట్ చేస్తున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయినపల్లి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on మే 9, 2021 at 1:50 సా.