Nithya menon : సౌత్ లో హీరోయిన్‌గా ఓ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్న యంగ్ హీరోయిన్స్ లో నిత్యా మీనన్ ఒకరు. ఆమె పర్ఫార్మెన్స్ తో ఇటు తెలుగు, అటు తమిళ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కొన్ని పాత్రలు నిత్యా కోసమే తయారయ్యాయి. అయితే నిత్యా మీనన్ మాత్రం వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఒప్పుకోదు. తన పాత్రకి సినిమాలో ప్రత్యేకత ఉండి ఆ పాత్ర ప్రేక్షకులకు నచ్చి తనకి మంచి పేరొస్తుందంటేనే ఓకే అంటుంది. లేదంటే నిర్మొహమాటంగా నో అనేస్తుంది. స్టార్ డైరెక్టర్ అయినా కథలో తన పాత్రకు ప్రాముఖ్యత లేకపోతే నో అనేస్తుంది.

no one expected a lip lock scene by nithya-menon

అలా మొదలైంది, ఇష్క్, గుండెజారి గల్లంతైందే, సన్నాఫ్ సత్యమూర్తి, గీత గోవిందం లాంటి సినిమాలు నిత్యాకి తెలుగులో బాగా పేరు తీసుకు వచ్చాయి. అయితే తనకి కథ నచ్చక వదిలేసిన సినిమాల సంఖ్య చాలా పెద్దదే. ఎక్స్‌ఫోజింగ్ చేయదు, గ్లామర్ రోల్స్..లిప్ లాక్స్, స్కిన్ షో ..వీటన్నింటికి దూరంగా ఉండటం కూడా నిత్యాకి కొంత మైనస్ అని టాక్ కూడా వినిపించింది. అయితే నిత్యా మీనన్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ చేసిన సినిమా మిషన్ మంగళ్ తనకి మంచి ఎంట్రీ సినిమాగా నిలిచింది. ముఖ్యమైన పాత్రలో నిత్యా కనిపించి ఆకట్టుకుంది.

Nithya menon : ప్రస్తుతం నిత్యా రేస్ లో బాగా వెనకబడి ఉంది.

నిత్యా లాంటి టాలెంటెడ్ హీరోయిన్ ఓకే అనాలేగాని ప్రతీ ఇండస్ట్రీలో క్రేజీ ఆఫర్స్ దక్కుతాయి. అలానే బాలీవుడ్ లో కూడా దక్కాయి. అయితే అభిషేక్ బచ్చన్ నటించిన బ్రీత్ ఇంటు ది షాడోస్ వెబ్ సిరీస్‌లో ఓ రోల్ చేసింది. ఇందులో లెస్బియన్ గా కనిపించిన నిత్య ఓ సీన్ లో మరో అమ్మాయితో కలిసి లిప్ లాక్ చేసింది. ఇలాంటి సీన్ చేస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ ఫస్ట్ టైం నిత్యా లిప్ కిస్ తో షాకిచ్చింది. అయితే ఆ సీన్ కథకి చాలా ఇంపార్టెంట్ కావడం వల్లే చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చింది. అయినా ఇది పెద్ద హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం నిత్యా రేస్ లో బాగా వెనకబడి ఉంది.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 12, 2021 at 1:00 సా.