V.V.Vinayak : టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్స్ లో ఒకరు వి వి వినాయక్. ఆయన అసలు పేరు గండ్రోతు వీర వెంకట వినాయకరావు. ఇండస్ట్రీలో ఎవరి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి పెద్ద దర్శకుడు అయ్యాడు. ప్రముఖ దర్శకులు ఈవీవీ సత్యనారాయణ దగ్గర, ఆ తర్వాత సాగర్ గారి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసి ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నారు. అసోసియేట్ గా చేస్తున్న సమయంలో ఇండస్ట్రీలోని ప్రముఖులతో పరిచయాలు ఏర్పరచుకున్నాడు. కో డైరెక్టర్ గా అందరికి తానే కావాలనేలా పక్కా ప్రణాళికతో షెడ్యూల్స్ ప్లాన్ చేశాడు. ఒక్కసారి వినాయక్ షెడ్యూల్ ప్లాన్ చేస్తే డైరెక్టర్ కూడా మార్చే అవకాశం ఉండదు. వాణీశ్రీ, మల్లికార్జున రావు లాంటి వాళ్ళ కి సీన్స్ చెప్పాలంటే వినాయక్ తప్ప మరెవరూ వద్దనేవారు.

no-one-identifies-v-v-vinayak-with-his name
no-one-identifies-v-v-vinayak-with-his name

అలా అందరికీ బాగా దగ్గరయ్యాడు. జూనియర్ ఎన్.టి.ఆర్ తో ఆది సినిమాను తీసి దర్శకుడిగా మారాడు. ఓసారి ఎన్.టి.ఆర్ కి కథ చెప్పడానికి వెళ్ళిన వినాయక్ తో అందరు నాకు లవ్ స్టోరీలే చెబుతున్నారు. నువ్వు కూడా లవ్ స్టోరీనే చెప్తే ఎలా..ఏదైనా కొత్త కథ ఉంటే చెప్పు అన్నాడట. అంతేకాదు ఇలాంటి లవ్ స్టోరీ తరుణ్, నితిన్, ఉదయ్ కిరణ్ లాంటి వాళ్ళకి బాగా సూటవుతాయని సలహా ఇచ్చాడట. దాంతో కాసేపు ఆలోచించి గాల్లో సుమోలు లేస్తాయ్..చిన్న పిల్లాడు బాంబులు విసురుతాడు..ఆ చిన్న పిల్లాడు నీ క్యారెక్టరే..నువ్వు విజిల్ వేస్తే గాల్లో సుమోలు లేస్తాయ్..ఇది నచ్చితే కథ రాస్తానని వినాయక్, ఎన్.టి.ఆర్ కి చెప్పాడు.

V.V.Vinayak : బాగా తెలిసిన వ్యక్తే ఆది సినిమా తీసింది వి వి వినాయక్ అంటే నమ్మలేదట.

విపరీతంగా నచ్చి కథ సిద్దం చేసేయ్ అన్నాడు. మూడు రోజుల్లో తిండి నిద్ర లేకుండా సీన్స్ మొత్తం రాసి ఎన్.టి.ఆర్ ని కలిసి కథ మొత్తం చెప్పగానే ఆయనకి విపరీతంగా నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలా ఆది సినిమాతో వినాయక్ డైరెక్టర్ అయ్యాడు. అయితే ఇండస్ట్రీలో అందరు వినయ్ అని పిలిచేవారు. అయితే మొదటి సినిమాకి టైటిల్ కార్డ్ లో వినాయక్ రావు అంటే బాగోదు..వినయ్ అంటే అప్పటికే ఆ పేరుతో వేరే వాళ్ళున్నారు. కాబట్టి వివి.వినాయక్ అని పెట్టుకున్నాడట. కానీ బాగా తెలిసిన వ్యక్తే ఆది సినిమా తీసింది వి వి వినాయక్ అంటే నమ్మలేదట. అదే ఇప్పుడు వినయ్ అని పెద్ద డైరెక్టర్ ఉన్నారు..అని అడిగితే ఆయనెవరు అని అడుగుతున్నారని స్వయంగా ఈ విషయాన్ని ఆయనే చెప్పారు. కాగా వి వి వినాయక్ ప్రస్తుతం ఛత్రపతి హిందీ రీమేక్ చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలైంది.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూలై 19, 2021 at 12:00 సా.