Ram Charan: కావాలని ‘ఆచార్య’లో పూజాను తీసుకొచ్చుకున్న చరణ్‌కి ఇప్పుడు పెద్ద షాక్..

G K

Ram Charan:: మెగా మల్టీస్టారర్‌గా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఆచార్య. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ ఛాప్టర్ 2 లాంటి భారీ పాన్ ఇండియన్ సినిమాలు వచ్చి బాక్సా ఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నమోదు చేయడంతో ఆ హైప్ ఆచార్యకు వచ్చింది. ఇద్దరు మెగా హీరోలు చిరు – చరణ్ కలిసి మొదటిసారి సిల్వర్ స్క్రీన్ మీద పూర్తి స్థాయిలో కనిపించబోతుండటంతో కేవలం మెగ అభిమానుల్లో మాత్రమే కాకుండా కామన్ ఆడియన్స్‌లో కూడా విపరీతంగా అంచనాలు పెరిగిపోయాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి నిన్నటివరకు నిర్వహించిన ప్రమోషన్స్ వరకు సినిమాపై ప్రతీదీ అంచనాలు పెంచినదే.

కానీ, ఆ అంచనాలను ఆచార్య కాస్త కూడా అందుకోలేకపోయింది. మెగాస్టార్ చిరంజీవి ఉన్నారంటే వారం రోజుల ముందు గానే రిలీజయ్యాక వారం వరకు టికెట్స్ దొరకడం చాలా కష్టమయ్యేది. కానీ, చాలాచోట్ల ఆ వాతావరణం కనిపించలేదు. చిరు – చరణ్ ఉన్న ఆచార్యకు అడ్వాన్స్ బుకింగ్స్ చాలా వీక్‌గా కనిపించాయి. అక్కడే ఏదో తేడా కొడుతుందే అని అందరూ అనుకున్నారు. ఎట్టకేలకు యూఎస్ ప్రీమియర్స్, రెండు తెలుగు రాష్ట్రాలలో బెనిఫిట్ షోస్ పడిన తర్వాత ఆచార్య టాక్ నెగిటివ్‌గానే మొదలైంది. చిరు సినిమాకు ఇలా టాక్ రావడం చాలా అరుదు.

no use of pooja hegde in acharya
no use of pooja hegde in acharya

Ram Charan: ఇది కూడా మైనస్ అని చెప్పుకుంటున్నారు.

అయితే, మొదటి సహజంగా కొన్ని సినిమాలకు నెగిటివ్ టాక్ కామన్ అనుకున్నా.. అదే బలపడుతోంది. ఇక ఈ సినిమాలో చరణ్ పక్కన హీరోయిన్‌గా పూజా హెగ్డేను తీసుకున్నారు. రష్మికను అనుకున్నా కూడా చరణ్ ఎందుకో పూజాకే ఓటు వేశాడు. తనే కావాలని పట్టుపట్టాడు. కానీ, రాధే శ్యామ్, బీస్ట్ సినిమాల రిజల్ట్‌తో ఆచార్య మీద సందేహాలు మొదలయ్యాయి. ఇప్పుడు అదే నిజమయ్యాయి. ఈ సినిమాలో పూజా ఉన్నది కాసేపే. అది కూడా సో సో పాత్ర. ఆడియన్స్‌కు రిలీఫ్ కోసం చరణ్ సరసన ఓ పాటలో కనిపించడం తప్ప ఆమె చేసింది ఏమీ లేదు. ఇది కూడా మైనస్ అని చెప్పుకుంటున్నారు.

- Advertisement -