Kota Srinivasa Rao: అస్పత్రులు కాదు ఫస్ట్ సినీ కార్మికులకు భోజనాలు పెట్టండి.. మెగాస్టార్ పై కోటా కామెంట్స్ వైరల్!

Akashavani

Kota Srinivasa Rao:టాలీవుడ్ విలక్షణ నటుడిగా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న కోట శ్రీనివాస్ రావు గురించి అందరికీ సుపరిచితమే. ఈయన కొన్ని వందల సినిమాల్లో తన విలనిజాన్ని చూపించి అందరిని భయభ్రాంతులకు గురి చేశారు.ఈ విధంగా ఎన్నో సినిమాల్లో నటుడిగా మెప్పించిన కోటశ్రీనివాసరావు ప్రస్తుతం తన వయసు పైబడటంతో సినిమాలకు దూరంగా ఉండి పలు యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే కోట శ్రీనివాసరావు తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ ఇస్తూ.. మెగాస్టార్ చిరంజీవి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి కార్మికుల దినోత్సవం సందర్భంగా ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కార్మికుల దినోత్సవానీకి ముఖ్య అతిథిగా పాల్గొని పెద్దఎత్తున కార్మిక దినోత్సవ సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ మాట్లాడుతూ త్వరలోనే ఫిలింనగర్లో అత్యాధునిక సదుపాయాలు కలిగినటువంటి ఆస్పత్రిని నిర్మిస్తామని వెల్లడించారు. మెగాస్టార్ తీసుకున్న ఈ నిర్ణయానికి ఎంతోమంది ఆయన పై ప్రశంసలు కురిపించారు. అయితే ఈ విషయంపై కోట శ్రీనివాసరావు చిరంజీవిపై విమర్శలు చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Kota Srinivasa Rao: ఆస్పత్రులు కట్టడం కాదు.. ఫుడ్ పెట్టండి అంటూ చిరంజీవి గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన కోట!
Kota Srinivasa Rao: ఆస్పత్రులు కట్టడం కాదు.. ఫుడ్ పెట్టండి అంటూ చిరంజీవి గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన కోట!

Kota Srinivasa Rao: కోట్లలో రెమ్యూనరేషన్…

ఈ సందర్భంగా కోటా మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి ఫిలిం నగర్ లో ఆస్పత్రి కడితే ఎవరు వెళ్లి చూపించుకుంటారు. డబ్బులు ఉన్నవాళ్లు అక్కడికి ఎవరూ వెళ్ళరు ఏ ప్రైవేట్ హాస్పిటల్స్ లోనో వైద్యం చేయించుకుంటారు. మెగాస్టార్ చిరంజీవి గారికి ఒకటే చెబుతున్నా ఫిలింనగర్ లో ఆసుపత్రులు కట్టడం కాదు.. కృష్ణానగర్ లో ఎంతో మంది సినీ కార్మికులు అవకాశాలు లేక ఆకలి కేకలతో కడుపు మార్చుకుంటున్నారు. వీలైతే వారికి ముందు ఫుడ్ పెట్టండి అంటూ కోట ఘాటుగా స్పందించారు. ఇక మెగాస్టార్ కార్మికుల దినోత్సవం సందర్భంగా తాను కళాకారుడు కాదని ఎప్పటికీ కార్మికుడని చెప్పిన మాటలపై ఆయన ఎద్దేవా చేశారు. మెగాస్టార్ చిరంజీవి ఒక్కో సినిమాకు కొన్ని కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అలాంటి ఆయన సినీ కార్మికుడు ఎలా అవుతారు అంటూ,ఇలాంటి మాటలు తనకు నచ్చని కోటశ్రీనివాసరావు మెగాస్టార్ చిరంజీవి గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

- Advertisement -