Nuvvu Nenu Prema November 29 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో ఈ జాగింగ్ అవన్నీ వదిలేసి మనం నడుచుకుంటూ ఇంటికి వెళ్లి పోదాం పదండి అనడంతో అక్కడున్న వాళ్ళందరూ నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు పద్మావతి ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసి ఉండాలి వీళ్ళందరి ముందు నీకు బలం లేదని తెలిస్తే నాకు చాలా బాధగా ఉంటాది అంటూ విక్కీని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. అప్పుడు పనిమనిషి చిలకమ్మ అయింది ఏదో అయింది అమ్మ అయ్యగారి బలం ఏంటో కూడా మనిద్దరం చూద్దాం అని అంటుంది. ఆ వ్యాయామం చేసే వాళ్ళు తన వల్ల చేతకాదు కాబట్టి మౌనంగా ఉన్నాడు అంటూ రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతారు. అప్పుడు విక్కీ అందరి ముందు షర్టు విప్పేసి ఆ వ్యాయామలు చేస్తూ ఉండడంతో అది చూసి పనిమనిషి చిలకమ్మా పద్మావతి తెగ సంతోష పడుతూ ఉంటారు.

విక్కీని తక్కువ అంచనా వేసిన పద్మావతి

విక్కీ వ్యాయామాలు చేస్తూ ఉండటం చూసి పద్మావతి అలాగే షాకింగ్ గా చూస్తూ తిరిగి చిలకమ్మ మీద పడిపోవడంతో చిలకమ్మ నిద్ర లేపుతుంది. అయ్యో శ్రీనివాస మా ఆయన పవర్ తెలియక ఏదో నోటికి వచ్చిన విధంగా మాట్లాడిన మళ్లీ నాకు ఉంటుంది అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది పద్మావతి. అప్పుడు బరువులు ఎత్తుతూ వ్యాయామలు చేయడంతో అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళు సారీ బ్రదర్ ఇంకెప్పుడు ఇలా మాట్లాడము అని రియలైజ్ అవుతూ ఉంటారు. సారీ అమ్మ పద్మావతి మీ ఆయనకు బుద్ధి బలంతో పాటు కండబలం కూడా ఉంది అనడంతో పద్మావతి సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడు విక్కీకి వాటర్ బాటిల్ తీసుకువచ్చి ఇవ్వడంతో వాళ్ళందెముందు అలాగే ముఖం కడుక్కుంటాడు.

కుచల మాటలకు టెన్షన్ పడుతున్న అను,ఆర్య

ఆ తర్వాత అను టెన్షన్ పడుతూ ఉండగా ఇంతలో ఆర్య ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ తెచ్చి ఇవ్వడంతో అను టెస్ట్ చేసుకోవడానికి వెళుతుంది. అప్పుడు అను బయటకు వచ్చి నెగిటివ్ వచ్చి ఉండేది అనడంతో ఆర్య అను ఇద్దరు డిసప్పాయింట్ అవుతారు. ఇప్పుడేం బాధపడకు స్వీట్ హార్ట్ ఇంకా చాలా సమయం ఉంది కదా మొన్ననే కదా మనకు పెళ్లి అయ్యింది అని అంటాడు ఆర్య. అత్తయ్య గారికి మన బాబుని ఎత్తుకోవాలని ఉంది కానీ ఆమె బయటపడటం లేదు అనడంతో ఆర్య ఆలోచనలో పడతాడు. ఇంతలోనే కుచల ఫోన్ చేస్తుంది. అప్పుడు కుచల బాబునో పాపను కావాలి అనడంతో అను ఆర్య ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు. భార్య నేను మీ భార్య మీద ప్రేమతో ఇన్నాళ్లు మౌనంగా లేను మన ఇంటికి వారసుడు వస్తాడు అన్న కారణంతో మౌనంగా ఉన్నాను.

అనుకి ధైర్యం చెప్పిన ఆర్య

ఒకవేళ అది జరగదు అని తెలిస్తే ఇంకా నా ప్లాన్లు వేరేలా ఉంటాయి ఈ విషయాన్ని నేను ముద్దుల భార్యకు కూడా చెప్పు అనడంతో అను ఆ మాటలకు బాధపడుతూ ఉంటుంది. అప్పుడు అను ఎక్కువగా బాధపడుతుండగా ఆర్య ధైర్యం చెబుతూ ముద్దు పెడతాడు. పద్మావతి విక్కీ కోసం ఇల్లు మొత్తం వెతుకుతూ ఉండగా బయట దర్జాగా మంచం పై పడుకొని ఉంటాడు విక్కీ. పద్మావతి ఏంటి సార్ దర్జాగా బయట పడుకుని ఉన్నారు అని అడగబోతుండగా కాలు జారీ వెళ్లి విక్కి మీద పడుతుంది. ఎందుకు పదే పదే ప్రతిసారి నేను ఉన్న చోటికి వచ్చి నా మీద పడతావు అని అంటాడు విక్కీ. ఆ తర్వాత అరవింద మురళి ఇద్దరు కలిసి పద్మావతి వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. మరొకవైపు విక్కీ షర్టులో పద్మావతి జుట్టు ఇరుక్కోవడంతో అది తీయడం రాక ఇబ్బంది పడుతూ ఉంటాడు.

Nuvvu Nenu Prema November 29 Today Episode: పద్మావతి విక్కీని చూసి సంతోషపడుతున్న అరవింద

అప్పుడు పద్మావతి నవ్వుతూ ఉండగా ఎందుకు నవ్వుతున్నావు అనడంతో పెద్ద బిజినెస్ నైట్ అని చెప్తారు. ఇంత చిన్న చిక్కు తీయడం కూడా రాదా అంటూ పద్మావతి ఆ జుట్టును తీసుకోబోతుండగా ఇంతలో గాలి వీయడంతో ఇద్దరు ఒకరి కళ్ల లోకి ఒకరు కళ్ళు పెట్టి చూసుకుంటుండగా ఇంతలో అరవింద వాళ్ళు అక్కడికి వస్తారు. అది చూసి అరవింద సంతోష పడుతుండగా మురళి కుళ్లుకుంటూ ఉంటాడు. పద్మావతి అని పిలవడంతో ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు. తర్వాత అందరూ వచ్చి అరవింద వాళ్ళను ప్రేమగా పలకరిస్తూ ఉంటారు. అప్పుడు మురళి వైపు పార్వతి వాళ్ళు కోపంగా చూస్తూ ఉంటారు. నేనంటే వీళ్లకు మర్యాద లేకుండా పోయింది వీళ్ళకు నేనంటే ఏంటో చూపించాలి అని అనుకుంటూ ఉంటాడు మురళి..

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

AkashavaniEditor

Hai I'm Akashavani, Film Journalist. I breathe and live entertainment. I love to watch serials and films from childhood-now I get paid for it. I worked in a few top media houses such as News18 Telugu,...

Mail

Published on నవంబర్ 29, 2023 at 8:00 ఉద.