Viral Video : ఇది సోషల్ మీడియా కాలం. ఎక్కడ చూసినా జనాలు ఎక్కువగా సోషల్ మీడియాలోనే గడుపుతున్నారు. సోషల్ మీడియా అంటేనే అంత. సోషల్ మీడియాలోనే జనాలు ఎక్కువగా గడుపుతున్నారు. సోషల్ మీడియాలో ఏది పోస్ట్ అయినా వెంటనే అది వైరల్ అవ్వాల్సిందే. కాస్తో కూస్తో వెరైటీగా ఏదైనా వీడియో కనిపిస్తే చాలు.. అది వైరల్ కావాల్సిందే. ప్రతి రోజు సోషల్ మీడియాలో వందలు, వేల వీడియోలు అప్ లోడ్ అవుతుంటాయి. కానీ.. అన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావు. ఏవో కొన్ని వీడియోలు మాత్రమే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.

తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో సంచలనాలను సృష్టిస్తోంది. ఆ వీడియోను చూస్తే మీరు మాత్రం హడలిపోతారు. అయ్య బాబోయ్.. ఏంది ఈ పని అని ముక్కున వేలేసుకుంటారు. పాములను చూస్తేనే మనం దడుసుకుంటాం కదా. కానీ.. ఈ ముసలాయన మాత్రం ఏకంగా పామును ముక్కులో పెట్టేసుకున్నాడు. ఆశ్చర్యంగా ఉంది కదా. ఇంకా అయిపోలేదు. ముక్కులో పెట్టుకొని దాన్ని నోటి నుంచి బయటికి లాగాడు. అసలు.. ఆ వీడియో చూస్తే మాత్రం ఒళ్లు గగుర్పాటుకు గురి కావాల్సిందే.
Viral Video : ముక్కులో దూర్చి.. నోటి నుంచి బయటికి
చాలా సరదాగా.. ఏమాత్రం టెన్షన్ లేకుండా.. ఓ పామును పట్టుకొని దాన్ని ముక్కులో దూర్చి.. తిన్నగా నోట్లో నుంచి తీశాడు ఆ తాత. కుర్చీలో కూర్చొని ఆయన చేసిన సాహసానికి నెటిజన్లు మాత్రం చేతులెత్తి దండం పెడుతున్నారు. అయినా.. అంత రిస్క్ ఎందుకు తాత.. ఆ పాము అలాగే లోపలికి వెళ్లిపోతే ఏంటి పరిస్థితి. ప్రాణాలను తెగించి ఇలాంటి సాహసాలు చేయడం అవసరమా? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా.. ఆ తాత చేసిన సాహసానికి కొందరు నెటిజన్లు అయితే మెచ్చుకుంటున్నారు. ఏదైనా టాలెంటే. నీకు ఆ టాలెంట్ ఉంది. నీలా ఎవ్వరూ చేయలేరు.. అంటూ తెగ పొగిడేస్తున్నారు. మీరు కూడా ఆ తాత చేసిన సాహసాన్ని కళ్లార్పకుండా చూడండి.