Nagarjuna : అక్కినేని నాగార్జున – యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కలిసి ఓ సినిమా చేయాల్సింది. కానీ ఎన్.టి.ఆర్ ప్లేస్‌లో కోలీవుడ్ స్టార్ హీరో నటించాడు. సౌత్ మాత్రమే కాకుండా నార్త్ సినిమా ఇండస్ట్రీలోను కొన్ని కాంబినేషన్స్‌లో సినిమా అనుకున్న తర్వాత అనివార్య కారణాల వల్ల ఆ కాంబినేషన్ కుదరక కాంబినేషన్ మారిపోతుంది. ఇద్దరు హీరోలతో చేయాల్సిన సినిమా ఒకరు డ్రాపవడమో లేక డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడం వలనో వేరే హీరోను రీ ప్లేస్ చేసి ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తారు. అయితే కొన్ని సార్లు ఇలా కాంబినేషన్ మారినా కూడా బ్లాక్ బస్టర్ అయిన సందర్భాలున్నాయి. అలాగే ఆ కాంబినేషన్‌ను జనాలు ఇష్టపడక ఫ్లాప్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.

Oopiri-would-have-a-classic-hit-if-made-by-nagarjuna-ntr
Oopiri-would-have-a-classic-hit-if-made-by-nagarjuna-ntr

అలాంటి కాంబినేషన్‌లో రావాల్సిన సినిమా ఊపిరి. ఇందులో ముందు అక్కినేని నాగార్జున – యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కలిసి నటించాల్సి ఉంది. ఇద్దరికి కథ బాగా నచ్చింది. అక్కినేని నాగార్జున – యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ మధ్య పర్సనల్‌గా మంచి బాండింగ్ ఉంది. ఈ కారణంతో ఇద్దరు కలిసి ఊపిరి సినిమా చేయాలనుకున్నారు కూడా. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ పొట్లూరి వి. ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. అయితే ఎన్.టి.ఆర్ చేయాల్సిన క్యారెక్టర్ ను కోలీవుడ్ స్టార్ హీరో కార్తి చేశాడు. నాగార్జున – కార్తి అనగానే జనాలలో ఆసక్తి బాగానే పెరిగింది.

Nagarjuna : నాగార్జున – ఎన్.టి.ఆర్ కలిసి ఊపిరి చేసుంటే మంచి క్లాసిక్‌గా ఇండస్ట్రీ హిట్ సాధించేది.

ఎన్.టి.ఆర్ కి డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో కార్తి రావడం అదే సమయంలో బై లింగ్వెల్ చేయాలని డిసైడవడం చక చకా జరిగిపోయాయి. దాంతో ఊపిరి సినిమాను ఒకేసారి తెలుగు తమిళంలో రిలీజ్ చేశారు. రెండు చోట్లా సూపర్ హిట్ సాధించింది. ఫ్రెంచి సినిమా “ది ఇన్‌టచబుల్స్” ఆధారంగా వంశీ పైడిపల్లి ఊపిరి సినిమాను రూపొందించాడు. అయితే ఇందులో ఎన్.టి.ఆర్ చేయకపోవడం అభిమానులకి, ఆయనకి కొంత నిరాశ కలిగించిన విషయం. కార్తి కాకుండా నిజంగా నాగార్జున – ఎన్.టి.ఆర్ కలిసి ఊపిరి చేసుంటే మంచి క్లాసిక్‌గా ఇండస్ట్రీ హిట్ సాధించేది. సినిమా చూశాక టాలీవుడ్ ప్రముఖుల అభిప్రాయం కూడా ఇదే అయింది.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూలై 12, 2021 at 12:00 సా.