Koratala siva : కొరటాల శివ – ఎన్టీఆర్ కాంబోలో కూడా పాన్ ఇండియన్ సినిమా..!

G K

Koratala siva : కొరటాల శివ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబోలో కొత్త ప్రాజెక్ట్ రీసెంట్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ మల్టీస్టారర్‌లో నటిస్తున్నాడు. మెగా పవర్ స్టార్ రాం చరణ్ మరొక హీరోగా నటిస్తున్న ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 13న భారీ స్థాయిలో అన్నీ సౌత్ భాషలతో పాటు హిందీ..సహా మరికొన్ని భాషల్లో కూడా రిలీజ్ చేయబోతున్నారు. కొమురం భీం పాత్రల్లో ఎన్టీఆర్, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ నటిస్తున్నాడు.

pan-indian-movie-by-koratala-siva-ntr-combo
pan-indian-movie-by-koratala-siva-ntr-combo

ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. కొరటాల శివ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబోలో జనతాగ్యారేజ్(2017) అనే బ్లాక్ బస్టర్ సినిమా రిలీజైన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మళ్ళీ కొరటాల శివ – ఎన్టీఆర్ కాంబోలో సినిమా వస్తుందని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకి ఇప్పుడు మళ్ళీ ఈ కాంబినేషన్ సెట్ అయింది. దాంతో భారీ అంచనాలు మొదలయ్యాయి.

Koratala siva : కొరటాల శివ మార్క్ తో పాన్ ఇండియన్ సినిమా..?

అయితే ఈ కాంబినేషన్‌లో సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి ఎలాంటి కథ ..ఏ స్థాయిలో నిర్మించబోతున్నారు అని అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి. అయితే ఆర్ఆర్ఆర్ వంటి పాన్ ఇండియన్ సినిమా తర్వాత కూడా తారక్ పాన్ ఇండియన్ సినిమాలే చేయాలని డిసైడయ్యాడట. అందుకే కొరటాల తారక్ కోసం పాన్ ఇండియన్ కథాంశాన్నే తయారు చేస్తున్నాడట. భారీ బడ్జెట్ తో కొరటాల మార్క్ తో పాన్ ఇండియన్ సినిమా రూపొందబోతుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.

- Advertisement -