Pawan Kalyan: ఏపీలో ఇప్పటికే టీడీపీ, వైసీపీ రాజకీయాలు చాల జోరుగా చేస్తున్నాయి. ఇప్పటికే ఈ రెండు పార్టీలు ఒకదానిపై ఒకటి ఎత్తులు, వ్యూహాలు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నాయి. అయితే వచ్చే ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్న జనసేన మాత్రం ఇంకా ఎలాంటి వ్యూహాలు లేకుండా ఎప్పటిలానే వాళ్ళను, వీళ్ళను చూస్తూ కూర్చుంది. పవన్ కళ్యాణ్ కూడా తన మూవీ షూటింగ్స్ లో చాలా బిజీగా ఉన్నాడు. అలాగే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా జనసేన ఒంటరిగా పోటీ చేసే ఛాన్స్ లేదు, ఆ విషయాన్నీ పవన్ కల్యాణే చాల సార్లు చెప్పాడు. అయితే వచ్చే ఎన్నికల్లో ఎదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకొనే ఎన్నికలకు వెళ్ళడానికి సిద్ధమైన జనసేనపై సోషల్ మీడియాలో టీడీపీ, వైసీపీ, బీజేపీలకు సంబంధించిన నాయకులు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆ మాటలను పట్టుకొని, జనసేన నాయకులు అవే నిజమని అనుకుంటున్నారు. అయితే అలాంటి వార్తలకు చెక్ పెట్టడానికి పవన్ కళ్యాణ్ యే ముందుకు వచ్చాడు.

టీడీపీని కూడా నమ్మొద్దు
జనసేన గురించి సోషల్ మీడియాలో వచ్చే ఏ న్యూస్ ను జనసేన కార్యకర్తలు కానీ నాయకులు కానీ నమ్మాల్సిన అవసరం లేదని, వేరే పార్టీ వాళ్ళు ఎదో అంటున్నారని ఆ మాటలను పట్టుకొని, వాళ్ళతో గొడవలు పడుతూ, తిడుతూ సమయాన్ని వృధా చెయ్యొద్దని పవన్ కళ్యాణ్ చెప్పారు. తానూ చెప్పే వరకు లేదా పార్టీ నుండి ఆఫీసియల్ ఇన్ఫర్మేషన్ వచ్చే వరకు ఎవరు కూడా సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మొద్దని తెలిపారు. అలాగే పొత్తుల విషయంలో కూడా చాలా రకాల వార్తలు వినిపిస్తున్నాయని, తానూ చెప్పే వరకు ఏ పార్టీ వారితోను కలిసి ఉండాల్సిన అవసరం లేదని, తానూ చెప్పే వరకు టీడీపీని కానీ బీజేపీ కానీ మరే ఇతర పార్టీని కానీ నమ్మొద్దని జనసైనికులకు పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలకు పార్టీకి కీలకమని, అందుకే ప్రతి ఒక్కరు కూడా చాల జాగ్రత్తగా ఉండాలని హితువు పలికారు.
వాళ్ళలా మనపై కేసులు లేవు
వచ్చే ఎన్నికల్లో జనసేనకున్న బలమైన ఆయుధమే… పార్టీ ఎవరిపైన ఎలాంటి కేసులు కానీ తప్పులు చేసిన వారు కానీ లేరని అదే మన బలమని జనసైనికులకు పిలుపునిచ్చారు. టీడీపీలా, వైసీపీ జనసేన ఎలాంటి కుంభకోణాలు చెయ్యలేదని, అదే తమ బలమని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఎలాంటి తప్పులు చెయ్యకుండా పార్టీని నడుపుతున్నాం కాబట్టి వేరే ఎవరో చెప్పిన మాటలను నమ్మకుండా పార్టీ నుండి వచ్చే అప్డేట్ ను మాత్రమే నమ్మాలని పవన్ తెలిపారు. అయితే ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి, ఇప్పటికే టీడీపీ, వైసీపీ ఫుల్ జోష్ మీద రాజకీయాలు చేస్తున్నారు. ఇలాంటి టైంలో కూడా జనసీన్ ఇంకా ఎందుకు ప్రజల్లోకి వెళ్లకుండా ఉందొ మాత్రం పవన్ ఎక్కడా కూడా చెప్పలేదు.