Nidhi agarwaal : నిధి అగర్వాల్ టాలీవుడ్‌లో అక్కినేని హీరోలతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. హైదరాబాద్ అమ్మాయి అయిన నిధి సినిమా అవకాశాల కోసం మోడలింగ్ కోసం ముంబై, బెంగుళూరులో ఎక్కువ సమయం గడిపింది. మున్న మైఖేల్‌తో బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన నిధి ఆ తర్వాత సవ్యసాచి సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించినంత సక్సస్‌ను అందుకోలేకపోయింది. అయినా నిధి గ్లామర్ అండ్ పర్ఫార్మెన్స్ చూసి వెంటనే మిస్టర్ మజ్ఞు సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. ఈ సినిమా కూడా బ్యూటీకి హిట్ ఇవ్వలేదు.

pawan kalyan is going to give life to nidhi-agarwaal
pawan kalyan is going to give life to nidhi-agarwaal

అయినా పూరి జగన్నాధ్ కంట్లో పడి ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇందులో నిధి అందాలతో ఆకట్టుకొని యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవడంతో వరసగా అవకాశాలు వస్తాయని అందరు భావించారు. కానీ సీన్ రివర్స్ అయి అవకాశల కోసం నిధి ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. తెలుగులో ఎప్పుడో గల్లా అశోక్ డెబ్యూ సినిమా మొదలు పెట్టింది. ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. అయితే ఈ ఇస్మార్ట్ బ్యూటీకి కోలీవుడ్ బాగా కలిసి వచ్చింది.

Nidhi agarwaal : నిధి అగర్వాల్ పవర్ స్టార్ సినిమాతో టాలీవుడ్‌లో సెటిలవుతుందేమో.

అక్కడ వరసగా శింబు, జయం రవిలతో చేసిన ఈశ్వరన్, భూమి సినిమాలు హిట్ అందుకోవడంతో అక్కడ క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. తమిళ అభిమానులను బాగా సంపాదించుకుంది. ఈ క్రమంలో అనూహ్యంగా పవర్ స్టార్ నటిస్తున్న పీరియాడికల్ మూవీ హరిహర వీరమల్లులో అవకాశం అందుకుంది. పవన్ కళ్యాణ్‌కు టాలెంట్ ఉన్నవాళ్ళు చాలు.. హిట్ లేకపోయినా క్రేజీ హీరోయిన్‌గా మార్చేస్తాడు. అందుకు ఉదాహరణ శృతి హాసన్. ఇప్పుడు నిధికి ఆ లక్ కలిసి వచ్చి పవర్ స్టార్  హీరోయిన్ అయ్యే అవకాశం ఇచ్చాడని చెప్పుకుంటున్నారు. చూడాలి మరి పవర్ స్టార్ సినిమాతో నిధి అగర్వాల్ టాలీవుడ్‌లో సెటిలవుతుందేమో.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on మే 15, 2021 at 3:00 సా.