Pawan Kalyan: ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు చెయ్యని ఒక పనిని వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ చెయ్యడానికి సిద్ధమయ్యాడు. ఇప్పటి వరకు ఏ నాయకుడు కూడా నేరుగా కులం పేరు చెప్పి ఓట్లు అడగలేదు కానీ పవన్ కళ్యాణ్ కేవలం కులాన్ని అడ్డుపెట్టుకుని వచ్చే ఎన్నికలకు సిద్ధమయ్యాడు. దేశంలో బీజేపీ ఎలాగైతే మతం పేరు చెప్పి, ఓట్లను అడుక్కుంటుందో ఇక్కడ ఏపీలో పవన్ కళ్యాణ్ కూడా సేమ్ స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు. ఇప్పుడు మరోసారి పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల విషయంలో వైసీపీ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాల వల్లే రాష్ట్రంలో రైతులు ఆత్మ హత్యలు చేసుకుంటున్నారని పవన్ మండిపడ్డారు. రైతుల విషయంలోనూ వైసీపీ కులాన్ని చూస్తుందని, దాదాపు మూడు వేలమంది కౌలు రైతులు మరణిస్తుంటే, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అయితే ఇక్కడ కులం విషయాన్నీ పవన్ కళ్యాణ్ ప్రస్తావించడంపై వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇష్టమొచ్చినట్టు పవన్ కళ్యాణ్ కు అలవాటైందని అంటున్నారు.

వైసీపీలో చలనం లేదు
రాష్ట్రంలో రైతుల సమస్యలను చూస్తే ఎవరికైనా బాధకలుగుతుందని, కానీ వైసీపీ ప్రభుత్వానికి మాత్రం మూడు వేలమంది రైతులు చనిపోతున్నా కూడా ఎలాంటి చలనం లేకుండా ఉంటుందని, రైతుల సమస్యలను తానూ రైతు భరోసా యాత్రలో తెలుసుకున్నానని, ఎలాంటి అధికారంలో లేని తనకే భాదేసి వాళ్లకు ఆర్థిక సహాయం చేశానని, ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. అయినా రాష్ట్రంలో 80% సాగు కౌలు రైతులు చేస్తున్నారని, వరి, పత్తి, మిరపలాంటి పంటలు వేసినా కూడా రైతులు నష్టపోతున్నారని, వాళ్ళను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై త్వరలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి, జనసేన తరపున రైతుల కోసం ప్రభుత్వంతో పోరాడుతామని తెలిపారు.
ఈ కులపిచ్చి ఏంటి పవన్ !!
ఇప్పట్లో పవన్ కళ్యాణ్ కులం ప్రస్తావనను వదిలేలా లేరు. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగుతున్న ప్రతి పార్టీకి ఎదో ఒక అజెండా ముందు నుండే ఉంది కాబట్టి వాళ్ళు అజెండాతో ముందుకు వెళ్తున్నారు కానీ జనసేనకు ముందు నుండి ఎలాంటి అజెండా లేదు కాబట్టి ఇప్పుడు కాపు కులాన్ని పట్టుకొని ఎన్నికలకు సిద్ధమతోంది. కాపుకుల ఓట్లను చూసుకొనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముందుకు వస్తున్నారు. పార్టీ పెట్టిన మొదట్లో కుల, మతాలకు అతీతంగా రాజకీయం చేస్తామని చెప్పిన పవన్, ఇప్పుడు కాపు కులాన్ని చూసుకొనే ఎన్నికల బరిలోకి దిగుతున్నాడు. కాపుకులాన్ని అధికారంలోకి తీసుకోని రావడానికి అన్ని కులాల వాళ్ళు ఏకం అవ్వాలని పవన్ కళ్యాణ్ కోరుతున్నారు. కుల రాజకీయాలు వద్దన్న వ్యక్తే ఇప్పుడు కుల రాజకీయాలు చెయ్యడం ఏంటని సామాన్య ప్రజలే ప్రశ్నిస్తున్నారు.