Pooja hegde : పూజా హెగ్డే టాలీవుడ్ లో ఒకేసారి రెండు సినిమాలతో ఎంట్రీ ఇచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా పరిచయమయిన ముకుంద సినిమా అలాగే అక్కినేని నాగ చైతన్య నటించిన ఒక లైలా కోసం సినిమా ఒకే ఏడాది కాస్త అటు ఇటుగా రిలీజయ్యాయి. ఈ రెండు సినిమాలు భారీ హిట్ కాకపోయినా యావరేజ్ అన్న టాక్ దగ్గర ఆగిపోయాయి. నిర్మాత సేఫ్. అయితే పూజా అకౌంట్ లో మాత్రం హిట్ చేరలేదు. ఆ తర్వాత బాలీవుడ్ లో స్టార్ హీరో హృతిక్ రోషన్ కి జంటగా మొహంజాదారో సినిమాలో అవకాశం రావడంతో టాలీవుడ్ వదిలి వెళ్ళిపోయింది.

pooja-hegde-has craze from the beginning
pooja-hegde-has craze from the beginning

అక్కడ రెండేళ్ళు ఉంది. ఆ సినిమా ఫ్లాపవడంతో మళ్ళీ తిరిగి దువ్వాడ జగన్నాథం సినిమాతో టాలీవుడ్ కి చేరింది. ఈ సినిమా కూడా పెద్ద హిట్ అనిపించుకోలేదు. ఇలా కెరీర్ ప్రారంభంలో పూజా హెగ్డే కి వరసగా ఫ్లాప్స్ వచ్చినప్పటికీ రెమ్యూనరేషన్ పరంగా మాత్రం భారీగానే అందుకుందని సమాచారం. ఫస్ట్ సినిమాకే పూజా హెగ్డే రెమ్యూనరేషన్ 30 లక్షలని సమాచారం. ఎక్కడా కూడా క్రేజ్ తర్వాత రెమ్యూనరేషన్ పెంచ లేదని ముందు నుంచే పూజా కి ఓ రేంజ్ క్రేజ్ ఉందని చెప్పుకుంటున్నారు.

Pooja hegde : పూజా హెగ్డే అందుకునే రెమ్యూనరేషన్ దాదాపు 3 కోట్లు..?

అందువల్లే ఇప్పుడు టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్.. ఎక్కడైనా పూజా హెగ్డే రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ అవుతోంది. తెలుగులో రాధే శ్యాం, ఆచార్య సినిమాలు చేస్తోంది. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్, రణ్‌వీర్ సినిమాలు చేస్తోంది. అలాగే కోలీవుడ్ లో విజయ్ 65 సినిమాలో నటించే అవకాశం అందుకుంది ఈ సినిమాకి పూజా హెగ్డే అందుకునే రెమ్యూనరేషన్ దాదాపు 3 కోట్లు అని సమాచారం. పాన్ ఇండియన్ సినిమా కావడంతోనే ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ అందుకుంటుందని చెప్పుకుంటున్నారు.

 

 

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on ఏప్రిల్ 28, 2021 at 9:00 ఉద.