Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్ గత కొన్ని రోజులుగా హర్ట్ అవుతూనే ఉన్నారు. అందుకు కారణం ప్రభాస్ సినిమాలకి సంబంధించిన ఏ ఒక్క సర్‌ప్రజింగ్ అప్‌డేట్ చిత్ర యూనిట్ నుంచి రాకపోవడమే. పాన్ ఇండియన్ స్టార్ అయిన ప్రభాస్ ప్రస్తుతం నాలుగు పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్నాడు. సాహో వచ్చి రెండేళ్ళు దాటిపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్‌తో రాధే శ్యాం సినిమా చేస్తున్నాడు.

prabhas-fans-are-disaapointed-once-again
prabhas-fans-are-disaapointed-once-again

 

ఈ సినిమా జూలై 30న అన్నీ సౌత్ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ ఈ సినిమా నుంచి ప్రమోషన్స్ మొదలవలేదు. చాలా నెలల నుంచి టీజర్..లిరికల్ వీడియో సాంగ్స్..వస్తాయని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కానీ ఎప్పటికప్పుడు డిసప్పాయింట్ చేస్తున్నారు చిత్ర యూనిట్. ఈలోపు కరోనా సెకండ్ వేవ్ వచ్చి పడింది. మళ్ళీ సినిమాల షూటింగ్స్ అన్నీ పోస్ట్‌పోన్ అవుతున్నాయి. సినిమాల రిలీజ్ కూడా వాయిదా పడుతున్నాయి. ఈ క్రమంలో రాధే శ్యాం అప్‌డేట్ ఇవ్వడం లేదు.

Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్ ఆదిపురుష్ సినిమా నుంచి ప్రభాస్ లుక్ రిలీజ్ అవుతుందని ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

అయితే కొన్ని గంటల క్రితం ప్రభాస్ నటిస్తున్న బాలీవుడ్ స్ట్రైట్ సినిమా ఆదిపురుష్ నుంచి సర్‌ప్రైజ్ ఉంటుందని టైం కూడా మెన్షన్ చేశారు. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆదిపురుష్ సినిమా నుంచి ప్రభాస్ లుక్ రిలీజ్ అవుతుందని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈరోజు ఉదయం 7.11 నిముషాలకి అప్‌డేట్ ఇస్తామన్న ఆదిపురుష్ చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అప్‌డేట్ రాకపోవడంతో ఫ్యాన్స్ మళ్ళీ డిసప్పాయింట్ అయ్యారు. మరోసారి ఫ్యాన్స్ మండిపాటు తప్పలేదు. చూడాలి మరి సాయంత్రం వరకు ఏదైనా అప్‌డేట్ ఇస్తారేమో.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on ఏప్రిల్ 21, 2021 at 9:23 ఉద.