Prabhas: ఈశ్వర్ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టి పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ గురించి తెలియని వారంటూ ఉండరు. బాహుబలి సినిమా విడుదలకు ముందు టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే హీరోగా గుర్తింపు పొందిన ప్రభాస్ బాహుబలి తర్వాత పాన్ ఇండియా హీరోగా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఆ సినిమా తరువాత ప్రభాస్ పాన్ ఇండియా రేంజ్ సినిమాలలో మాత్రమే నటిస్తూ బిజీగా ఉన్నాడు. అయితే ప్రభాస్ హీరోగా మాత్రమే కాకుండా వ్యక్తిత్వం పరంగా కూడా రాజే. పెదనాన్న కృష్ణంరాజు వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తున్న ప్రభాస్ ఇతరులకు ఆదిత్యం ఇవ్వటంలో కూడా కృష్ణంరాజుని మించిపోయాడు.
ప్రభాస్ తన కో – స్టార్స్ కి , దర్శక నిర్మాతలకు , సన్నిహితులకు ఎప్పుడూ మరిచిపోలేని విధంగా ఆతిథ్యాన్ని ఇస్తూనే ఉంటారు. అమోఘమైన తన ఇంటి వంటకాల రుచులను వారికి పరిచయం చేస్తుంటారు. తన మనసు మాత్రమే కాదు.. పెట్టే చేయి కూడా పెద్దదే అని నిరూపించుకున్నాడు. ఇప్పటికే ఎంతోమంది నటీనటులు, దర్శక నిర్మాతలు ప్రభాస్ ఇంటి భోజనం గురించి ఆయన అతిధి మర్యాదల గురించి చాలా గొప్పగా వెల్లడించారు. ఇక ఇప్పుడు మరొక యంగ్ డైరెక్టర్ కూడా ఇంచు మించు ఇలాంటి ప్రభాస్ ఆతిథ్యం గురించి గొప్పగా చెప్పాడు.
Prabhas: ప్రభాస్ దావత్ అంటే మామూలుగా ఉండదు..
ఇండస్ట్రీలో రైటర్ కమ్ డైరెక్టర్‌గా రాణిస్తున్న సాయి రాజేష్.. ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ హీరోగా ‘ బేబీ ‘ సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఇదిలా ఉండగా తాజాగా పాన్ ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్ ఇంటి నుండి వచ్చిన భోజనాన్ని టేస్ట్ చేస్తున్నా అంటూ ట్వీట్ చేశారు. ప్రభాస్ ఇంటి నుంచి వచ్చిన కీమా ఫ్రాన్ పులావ్, మటన్ పులావ్, ఎగ్ నూడుల్స్, చికెన్ మంచూరియా వెట్ వంటకాల ఫోటోలను కూడా ట్విట్టర్లో షేర్ చేస్తూ స్వర్గమే…. అంటూ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. మా అభిమాన హీరో గొప్పతనం అది అంటూ ప్రభాస్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.