Pragya jaiswal : ప్రగ్యా జైస్వాల్.. టాలీవుడ్‌లో ట్రెడీషనల్ హీరోయిన్‌గా .. గ్లామర్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. అయితే కంచె సినిమాతో వచ్చిన పాపులారిటీ ఆ తర్వాత రాలేదు. చేసిన ప్రతీ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో ప్రగ్యాకి స్టార్‌డమ్ దక్కలేదు. కంచె సినిమాలోని పాత్రకి పూర్తి భిన్నంగా గ్లామర్ ట్రీట్, స్కిన్ షో చేసినప్పటికి భారీ ప్రాజెక్ట్స్.. స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశం దక్కించుకోలేకపోయింది. అయినా సోషల్ మీడియాని వదలకుండా ఎప్పటికప్పుడు తన గ్లామర్ ట్రీట్ ఇస్తూ అటు నెటిజన్స్‌ను ఇటు మేకర్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉంది.

దాంతో లక్కీగా సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అఖండ సినిమాలో అవకాశం అందుకుంది. ఈ సినిమాకి దర్శకుడు బోయపాటి శ్రీను. ఇంతక ముందు ఆయన దర్శకత్వంలో వచ్చిన జయ జానకి నాయక సినిమాలో నటించింది ప్రగ్యా. ఈ కారణంగా మరోసారి తన దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో అవకాశం ఇచ్చాడు బోయపాటి. ప్రగ్యా పాత్ర కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని సమాచారం. ఒకరకంగా చెప్పాలంటే సింగ సినిమాలో నయనతార పాత్రలా డిజైన్ చేసినట్టు తెలుస్తోంది.
Pragya jaiswal : ప్రగ్యా జైస్వాల్ ని కొంతమంది భయపెట్టారట.
అయితే బాలయ్య సినిమాలో అవకాశం అనగానే ఎగిరి గంతేసిన ప్రగ్యాని కొంతమంది భయపెట్టారట. బాలయ్యకు కోపం ఎక్కువనీ..సెట్‌లో చాలా సైలెంట్‌గా ఉండాలని చెప్పారట. దాంతో ఈ బ్యూటీకి బాలయ్యతో కలిసి సీన్స్ చేయాలంటే భయపడినట్టు చెప్పుకొచ్చింది. కానీ సెట్‌లో అందరూ చెప్పినట్టుగా బాలయ్య లేకపోవడాన్ని చూసి షాకయిందట ప్రగ్యా. చాలా సరదాగా ఉన్నారని అందరితో బాగా మాట్లాడతారని ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. ఇక త్వరలో మరో షెడ్యూల్ మొదలవ్వాల్సి ఉండగా అందుకోసం ఆతృతగా ఎదురు చూస్తున్నట్టు ఈ బ్యూటీ తెలిపింది.