విడుదల తేదీ: ఆగస్టు 18 2023
నటీనటులు: సంతోష్ శోభన్ రాశి సింగ్ రుచిత సాదినేని కృష్ణ చైతన్య, కృష్ణ తేజ, అశోక్ కుమార్, సుదర్శన్, తదితరులు
డైరెక్టర్: అభిషేక్ మహర్షి
నిర్మాతలు: శివప్రసాద్ పన్నీరు
మ్యూజిక్ డైరెక్టర్ : ఎస్. అనంత్ శ్రీకర్
సినిమాటోగ్రఫీ: రాంపీ నందిగాం
అభిషేక్ మహర్షి ఇండస్ట్రీకి డైరెక్టర్గా పరిచయం అవుతూ ప్రేమ్ కుమార్ అనే సినిమాని తెరకెక్కించారు. ఇందులో సంతోష్ శోభన్ రాశి సింగ్ హీరోయిన్లుగా నటించారు.మరి నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా అనే విషయానికి వస్తే…
కథనం: ప్రేమ్ కుమార్ (సంతోష్ శోభన్) కు ఎన్నో సంబంధాలు వచ్చినప్పటికీ ఈయనకు మాత్రం పెళ్లి కుదరదు అయితే చివరికి ఈయనకు నేత్ర (రాశి సింగ్)అనే అమ్మాయితో పెళ్లి కుదురుతుంది అయితే పెళ్లి జరుగుతున్న సమయంలో తాళి కట్టే సమయానికి రోషన్ బాబు (కృష్ణ చైతన్య)వచ్చి తాను నేత్ర పెళ్లి చేసుకున్నానని చెప్పడంతో నేత్ర తండ్రి మాదిరాజు వెంటనే నేత్రను రోషన్ బాబుకి ఇచ్చి పెళ్లి చేస్తారు. దీంతో ప్రేమ్ కుమార్ పెళ్లి ఆగిపోతుంది. ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి సెట్ కాకపోవడంతో ఈయన తన ఫ్రెండ్ సుందర్ లింగం (కృష్ణ తేజ) తో కలిసి డిటెక్టివ్ ఏజెన్సీ నడుపుతూ ప్రేమ జంటలను విడదీస్తూ ఉంటారు.అదే సమయంలో ఈయనకు నేత్ర ఎదురవుతుంది సినీ ఇండస్ట్రీలో ఎదిగిన రోషన్ నేత్రను కాకుండా అంగన (రుచిత సాదినేని) ఎందుకు వివాహం చేసుకుంటారు అన్నదే ఈ సినిమా కథ.
ప్లస్ పాయింట్స్: సినిమా కథ సంగీతం, నటీనటుల నటన
మైనస్ పాయింట్స్: ఎమోషనల్ సీన్స్ మరింత కనెక్ట్ అయి ఉంటే బాగుండేది.
సాంకేతిక విభాగం;డైరెక్టర్ తొలి ప్రయత్నం లోనే అద్భుతంగా సినిమాని తెరకెక్కించారు. ఇక సినిమాటోగ్రాఫర్ పని తీరు అద్భుతంగా ఉంది. అనంత శ్రీకర్ సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంది.
రేటింగ్: 3/5