Priyamani : నేషనల్ అవార్డ్ అందుకున్న ప్రియమణి పెళ్ళికి ముందు తెలుగు, తమిళ సినిమాలలో నటించి స్టార్ స్టేటస్ అందుకుంది. యంగ్ హీరోలతో నటించిన ఈమె బికినీలో కూడా దర్శనమిచ్చింది. స్విం సూట్స్ లో కనువిందు చేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో గోపీచంద్, నితిన్, బాలకృష్ణ, జగపతి బాబు, సుమంత్, జూనియర్ ఎన్.టి.ఆర్ లాంటి వాళ్ళతో నటించింది. ప్రియమణి కెరీర్ లో హిట్ సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. కెరీర్ మంచి ఊపు మీద ఉన్నప్పుడే ప్రేమ వివాహం చేసుకుంది. క్రేజీ ఆఫర్స్ వస్తుండగానే సినిమాలకి దూరం కావడం కాస్త షాకింగ్ విషయమే.

priyamani started second innings

చిన్న గ్యాప్ తీసుకున్న ప్రియమణి బుల్లితెర మీద గత ఏడాదిగా సందడి చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. పెళ్ళి తర్వాత కూడా మోడ్రన్, అల్ట్రా మోడ్రన్ అండ్ ట్రెడీషనల్ వేర్స్, శారీస్ లో కనిపిస్తూ క్రేజ్ ఏమాత్రం తగ్గకుండా జాగ్రత్త పడుతోంది. బుల్లితెర మీద బిగ్ రియాలిటీ షో ఢీ డాన్స్ షోకి జడ్జ్‌గా వ్యవహరిస్తున్న ఈమెకి లక్కీగా సినిమా అవకాశాలు వచ్చాయి. సెకండ్ ఇన్నింగ్స్ లో అవకాశాలు అందుకున్న ప్రియమణి మంచి సినిమాలలోనే అవకాశం అందుకోవడం ఆసక్తికరమైన విషయం. ఒక సినిమా వెంకటేష్‌తో కాగా మరొక సినిమా రానాతో చేసింది.

Priyamani : ప్రియమణికి మైనస్ అయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

తమిళంలో సూపర్ హిట్ అయిన అసురన్ రీమేక్‌గా రూపొందిన నారప్పలో విక్టరీ వెంకటేష్ కి జంటగా ప్రియమణి నటించింది. ఇందులో వచ్చిన అవకాశంతో మళ్ళీ సినిమా కెరీర్ బాగా ఊపందుకుంటుందని భావించింది. అందుకు తగ్గట్టుగానే రానా – సాయి పల్లవి నటించిన విరాట పర్వంలో కూడా కామ్రేడ్ భారతక్క పాత్రలో కనిపించబోతోంది. ఈ రెండు కూడా నటనకి పూర్తిగా ఆస్కారం ఉన్నవే కావడం విశేషం. డీ గ్లామర్ పాత్రలో నటించిన ప్రియమణికి నారప్ప, విరాట పర్వం హిట్స్ ఇస్తాయని అంటున్నారు. కానీ కరోనా దెబ్బతో ఈ సినిమాలు రిలీజ్ పోస్ట్ అయ్యాయి. దాంతో కాస్త ప్రియమణికి మైనస్ అయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంతేకాదు ఇలా అయితే ప్రియమణికి సెకండ్ ఇన్నింగ్స్ కలిసి రావడం కష్టమే అంటున్నారు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 4, 2021 at 3:39 సా.