Puri jagannaath : పూరి జగన్నాథ్ కూడా ఆయన గురువు సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ మాదిరిగా సెన్షేషనల్ కామెంట్స్ చేసి హాట్ టాపిక్ అవుతుంటాడు. ఆయన ఏదీ మనసులో దాచుకోరు. ఉన్నది ఉన్నట్టుగానే ఆయనకి ఏది కరెక్ట్ అనిపిస్తే అది బయటకి చెప్పే తత్వం. ఇండస్ట్రీలో నటించే వారే ఎక్కువ. వాళ్లకి లాంగ్ లైఫ్ ఉంటుంది. ముక్కుసూటిగా మాట్లాడే వాళ్ళని ఎవరు దగ్గరికి రావివ్వరు. వీలైనంత దూరం పెట్టడానికి అవకాశం ఇవ్వడానికి మోహం చాటేయడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ పూరి జగన్నాథ్ కి మాత్రం ఇలాంటి ముక్కుసూటితనం ఉన్నా అందరు ఆయన వెనకాల క్యూ కడుతున్నారు.

puri-jagannaath-says it is waste of time to make bahubali

బయట నిర్మాతకి పూరి జగన్నాథ్ కావాలి. హీరోలకి ఆయనతో సినిమా చేయాలి. కమర్షియల్ హీరో ఇమేజ్ దక్కాలంటే ఏ హీరో అయినా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేయాల్సిందే. మన తెలుగు హీరోలు మాత్రమే కాదు బాలీవుడ్, కన్నడ హీరోలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పూరి జగన్నాథ్ కి ఆయన రాసిన కథ ఆయనకే రెండు నెలల తర్వాత బోర్ కొట్టేస్తుంది. అలాంటిది రెండేళ్ళు బాహుబలి లాంటి సినిమాను తీయాలంటే అనవసరంగా టైమ్ వేస్ట్ అని ఫీలవుతున్నాడు. అలాంటి సినిమాను 100 రూపాయలు పెట్టి చూడటం ఇష్టం కానీ ఇలాంటి సినిమా కథ రాయాలన్నా, తీయాలన్న వేస్ట్ ఆఫ్ టైమ్ అంటున్నాడు.

Puri jagannaath : లైగర్ అనే పాన్ ఇండియన్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

ఇది రాజమౌళిని విమర్శించినట్టు కాదు..నాకంత ఓపిక లేదని చెబుతున్నా అని నిక్కచ్చిగా తేల్చి చెపుతున్నాడు. పూరి ఈ మైండ్ సెట్ లో ఉంటాడు కాబట్టే వారంలో కథ రాసి వారంలో బౌండెడ్ స్క్రిప్ట్ సిద్దం చేస్తాడు. మూడు నెలల్లో షూటింగ్ పూర్తి చేసి 4 నుంచి 5 నెలల్లో రిలీజ్ చేసేస్తాడు. రాజమౌళికి పూర్తి ఆపోజిట్‌గా పూరి సినిమాలు చేస్తాడు. ఇప్పుడు లైగర్ అనే పాన్ ఇండియన్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. విజయ్ దేవరకొండ – అనన్య పాండే జంటగా నటిస్తున్నారు. బాహుబలి సినిమా గురించి ఇలాంటి సెన్షేషనల్ కామెంట్స్ చేసినా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మాత్రం తన మొబైల్ డీపీగా పూరి ఫొటో పెట్టుకోవడం గొప్ప విషయం.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 10, 2021 at 2:13 సా.