Pushpa : పుష్ప సినిమా అసలు సినిమా కోసం అనుకున్న కథ కాదని సమాచారం. ఇప్పుడు ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. వెబ్ సిరీస్ ట్రెండ్ మొదలై బాగా సక్సెస్ కావడం ఓటీటీలో వీటికి బాగా ఆదరణ దక్కుతుండటంతో సుకుమార్ కూడా హై రేంజ్ లో తెరకెక్కించేందుకు ఓ వెబ్ సిరీస్ కోసం దేశంలోనే అతిపెద్ద స్కాం అయిన ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ కథను తయారు చేసుకున్నాడట. అయితే వెబ్ సిరీస్‌కు అనుకున్న కథలో పాన్ ఇండియన్ అపీల్ ఉండటంతో ఓ పెద్ద స్టార్‌తో సినిమా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

అందులో భాగంగా ఈ కథ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి సుకుమార్ చెప్పడంతో ఆయనకు ఈ కథ విపరీతంగా నచ్చి వెంటనే మన సినిమా చేద్దామని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అలా మొదలైన ఈ ప్రాజెక్ట్ ఏకంగా పాన్ ఇండియన్ స్థాయిలో మైత్రీ మూవీ మేకర్స్, ముత్యం శెట్టి మీడియా కలిసి 200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించే పుష్పగా తయారవుతోంది. ఇక ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ రెండు పార్టులుగా రిలీజ్ చేసే ఆలోచన మేకర్స్ చేయడం. పుష్ప పార్ట్ వన్ ఈ ఏడాది రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా తమిళ నటుడు ఫాహిద్ ఫాజిల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు.
Pushpa : పుష్పతో ఐకాన్ స్టార్‌గా మారాడు అల్లు అర్జున్.
సెకండ్ పార్ట్ లో ఆయన పాత్ర సినిమాకి చాలా కీలకం అని తెలుస్తోంది. బన్నీ పాత్రతో సమానంగా కొన్ని సీన్స్ ఉంటాయని తెలుస్తోంది. తెలుగుతో పాటు హిందీ, మలయాళం, కన్నడ, తమిళ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. బాహుబలి తర్వాత ఆ స్థాయిలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప కావడం గొప్ప విశేషం. అల్లు అర్జున్ అభిమానులలో ఇండస్ట్రీ వర్గాలలో ఊహించని రేంజ్‌లో అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇంతకాలం స్టైలిష్ స్టార్ అని పిలిపించుకున్న అల్లు అర్జున్ పుష్పతో ఐకాన్ స్టార్‌గా మారాడు.