Rahul Sipligunj: సింగర్‌గా బిగ్ బాస్ టైటిల్ విన్నర్‌గా రాహుల్ సిప్లిగంజ్ ఎంత క్రేజ్ తెచ్చుకున్నాడో అందరికీ తెలిసిందే. సింగర్‌గా, సాంగ్స్ కంపోజర్‌గా వచ్చిన పాపులారిటీ కంటే కూడా బిగ్ బాస్ సీజన్లో పాల్గొన్న తర్వాత జనాలలో వచ్చిన పాపులారిటీ విపరీతం. మరో కంటెస్ట్ పునర్నవి( పున్ను)తో హౌజ్‌లో మనోడు సాగించిన ప్రేమాయణం అంతా డ్రామా అయినా కూడా జనాలలో మాత్రం వాళ్ళు పెట్టుకున్న ముద్దులు, ఇచ్చుకున్న హగ్గులు చూసి రియల్ లవర్స్ అనుకున్నారు. అంతేకాదు, వీరి ప్రేమ ముదిరి పాకాన పడి పెళ్లి కూడా చేసుకుంటారని ప్రచారం జరిగింది.
ఇదే కథ ఇద్దరు బయటకు వచ్చాక కూడా చాలా నెలలు సాగింది. తీరా చూస్తే అది జనాలలో క్రేజ్ తెచ్చుకోవడానికి ఆడిన డ్రామా అని తేలిపోయింది. కొన్నిరోజులు పున్ను సోషల్ మీడియాలో బాగానే హాట్ టాపిక్ అయింది. కాని, రాహుల్ మాత్రం అటు అషురెడ్డితో కూడా రిలేషన్ మేయింటైన్ చేస్తూ వార్తల్లో నిలిచాడు. అంతే కాదు, జనాలలో రాహుల్ సిప్లిగంజ్‌కు ఉన్న క్రేజ్‌ను దృష్ఠిలో పెట్టుకొని స్టార్ మా వారు ఆ తర్వాత సీజన్లో ఎలిమినేట్ అయిన ప్రతీ ఒక్క కంటెస్ట్‌ను ఇంటర్వ్యూ చేసి బిగ్ హౌజ్‌లో అనుభవాలను పంచుకునే ప్రోగ్తాం ప్లాన్ చేశారు.

Rahul Sipligunj: రాహుల్ సిప్లిగంజ్ కూడా ఉండటం షాకింగ్ విషయం.
అలా కూడా రాహుల్ బాగానే పాపులర్ అయ్యాడు. ఇక ఈ క్రేజ్‌తో కృష్ణవంశీ రూపొందిస్తున్న రంగ మార్తాండ సినిమాలో కీలక పాత్రకు ఎంపికయ్యాడు. ఇదిలా ఉంటే తాజాగా హైదరాబాద్‌లోని ఓ పబ్బుపై పోలీసులు జరిపిన దాడుల్లో ఈ పాపులర్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా ఉండటం షాకింగ్ విషయం. ఆకస్మికంగా హైదరాబాద్ పోలీసులు బంజారా హిల్స్‌లోని పబ్బుపై దాడులు జరపగా 150 మంది పట్టు పడ్డారు. వారిలో రాహుల్ కూడా ఉన్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.