Rajanikanth 170 : కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో తెరకెక్కుతున్న 168 అన్నాత్తే. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన శివ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. సన్ పిక్చర్స్ బ్యానర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇందులో కీర్తి సురేష్ రజనీకాంత్ చెల్లెలిగా నటిస్తుండటం విశేషం. అంతేకాదు స్టార్ హీరోయిన్ నయనతార తో పాటు సీనియర్ హీరోయిన్స్ మీనా, ఖుష్బూ నటిస్తున్నారు. ఎంతో గ్రాండియర్ గా ఈ సినిమా రూపొందుతోంది. కబాలి నుంచి దర్బార్ వరకు వరుసగా రజనీకాంత్ నటించిన సినిమాలు ఫ్లాప్ గా మిగిలాయి. దాంతో ఈసారి భారీ హిట్ కొట్టాలని కసితో శివకి అవకాశం ఇచ్చారు రజనీ. కాగా ఈ ఏడాదిలోనే ఈ సినిమా రిలీజ్ కి సన్నాహాలు
చేస్తున్నారు.

rajanikanth-170-directed by dhanush..producers are his daughters
rajanikanth-170-directed by dhanush..producers are his daughters

అయితే ఇటివల రజనీకాంత్ ఆరోగ్యం కాస్త దెబ్బ తినడంతో ఇక సినిమాలు మానేస్తున్నట్టు వార్తలు వచ్చి వైరల్ అయ్యాయి. అన్నాత్త సినిమానే రజనీ కెరీర్ లో చివరి సినిమా అని ప్రచారం జరుగుతోంది. కానీ ప్రస్తుతం కోలీవుడ్ లో మాత్రం వార్తలు ఇందుకు భిన్నంగా వస్తున్నాయి. ఈ వార్తలు రజనీకాంత్ అభిమానులను టన్నుల కొద్దీ ఉత్సాహాన్నిస్తున్నాయి. అదేమిటంటే రజనీకాంత్ ఇప్పటికే రెండు సినిమాలను లైన్ లో పెట్టారట. ఈ రెండు ఎంతో క్రేజీ మూవీస్ అని సమాచారం. కాగా ఒక సినిమా విషయంలో మాత్రం భారీ అంచనాలు.. ఆసక్తికరమైన చర్చలు మొదలయ్యాయి. అదే రజనీకాంత్ కెరీర్ లో తెరకెక్కబోయో 170 వ సినిమా.

Rajanikanth 170 : రజనీకాంత్ తో పాన్ ఇండియన్ సినిమాను తెరకెక్కించబోతుండటం విశేషం.

ఇది ఆయన మైల్ స్టోన్ సినిమా కావడంతో భారీ స్థాయిలో నిరించడానికి స్వయంగా రజనీకాంత్ కూతుర్లే రంగంలోకి దిగబోతున్నట్టు తాజా సమాచారం. తండ్రితో భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ నిర్మించడానికి ఐశ్వర్య, సౌందర్య ప్లాన్ రెడీ చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా చరిత్రలో నిలిచేదిగా ఉంటుందట. ఇక్కడ మరో విశేషం కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్ అల్లుడు ధనుష్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడట. ధనుష్ ‘పవర్ పాండి’ సినిమాతో దర్శకుడిగా మారాడు. రీసెంట్ గా ధనుష్ తన దర్శకత్వంలో రెండవ అతి త్వరలో మొదలవనున్నట్టు వెల్లడించారు. అది రజనీకాంత్ 170 అని అంటున్నారు. దాంతో భారీ అంచనాలు మొదలయ్యాయి. ధనుష్ ఓ వైపు పాన్ ఇండియన్ సినిమాలలో హీరోగా నటిస్తూ మామ రజనీకాంత్ తో పాన్ ఇండియన్ సినిమాను తెరకెక్కించబోతుండటం విశేషం. ఇక రజనీ 169 కి పెరియసామి దర్శకత్వం వహించనున్నారు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూలై 10, 2021 at 12:00 సా.