Rajanikanth : కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కి ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే తమిళనాడు మొత్తం పండగ వాతావరణం నెలకొంటుంది. సినిమా రిలీజ్ కి రెండు మూడు రోజులు ముందే ఆఫీసులకి, స్కూల్స్, కాలేజెస్ కి సెలవులు ప్రకటిస్తారు. కొన్ని కంపెనీలు తమ స్టాఫ్ కి స్వయంగా టికెట్ ఇచ్చి మరీ సినిమాకి పంపిస్తారు. ఇక సినిమా రిలీజ్ రోజు థియేటర్స్ దగ్గర ఉండే కోలాహలం అంతా ఇంతా కాదు. ఆయన కటౌట్స్ కి పూలమాలలు, పాలాభిషేకాలు సర్వ సాధారణం.

rajinikanth-had-to-make-the-film-chandramukhi because of prabhu
rajinikanth-had-to-make-the-film-chandramukhi because of prabhu

అంతటి క్రేజ్ ఉన్న సూపర్ స్టార్ రజనీకాంత్ బాబా సినిమా చేసిన సమయంలో ఇదే నా చివరి సినిమా అని ప్రకటించారు. దాంతో ఆయన అభిమానులు ఎక్కడ చూసిన పట్టుబట్టి మరీ మీరు మళ్ళీ సినిమాలు చేయాల్సిందే. మీరు చేసిన ప్రకటనను వెనక్కి తీసుకోవాల్సిందే అని రిక్వెస్ట్ చేశారు. ఇదొక కారణం అయితే రజనీకాంత్ అనుకున్న సక్సెస్ బాబా సినిమాతో దక్కలేదు. సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలింది. అందుకే ఆయన ఓ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి సినిమాలు మానేయాలనుకున్నారు. ఇదే నిర్ణయానికొచ్చారు. మళ్ళీ దర్శక, నిర్మాతలకి సినిమా చేస్తున్నాంటూ సంకేతాలు పంపారు.

Rajanikanth : అందుకే తమిళ నాడులోకాక ప్రపంచవ్యాప్తంగా ‘తలైవ’ రజనీకాంత్ కి అంతక్రేజ్.

ఈ క్రమంలో పి. వాసు దర్శకత్వంలో చంద్రముఖి సినిమా చేశారు రజనీకాంత్. అంతకముందు కన్నడలో ఆప్తమిత్రగా వచ్చి సూపర్ హిట్ అయిన సినిమానే చంద్రముఖి తమిళ రీమేక్. తెలుగులో బ్లాక్ బస్టర్ సాధించింది. ఈ సినిమా చేయడానికి కారణంలో ఇందులో మరొక కీలక పాత్ర పోషించిన ప్రభు. ఆ సమయంలో ప్రభు బాగా ఆర్ధిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. ప్రభు వాళ్ళ నాన్నగారు రజనీకాంత్ కి తండ్రి సమానులు. ఆ రకంగా ప్రభు – రజనీకాంత్‌ల మధ్య సోదర భావం ఉంది. మంచి స్నేహితులు. స్నేహితుడు కష్టాలలో ఉంటే రజనీ ఊరుకుంటాడా. అందుకే చంద్రముఖి సినిమాలో నటించి ప్రభు ఆర్ధిక కష్టాలు తీర్చారు. అదెలాగంటారా ఈ సినిమా నిర్మాత ప్రభు. అందుకే తమిళ నాడులోకాక ప్రపంచవ్యాప్తంగా తలైవ రజనీకాంత్ కి అంతక్రేజ్.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 29, 2021 at 10:03 ఉద.