Rakul preeth singh : రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్‌లో కెరటం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. కొన్నేళ్ళ పాటు టాలీవుడ్‌లో కెరటం లాగానే ఎగిరెగిరి పడింది. భారీ సక్సస్‌లు అందుకుంది. ఒకానొక దశలో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాకి కూడా డేట్స్ సర్దుబాటు చేయలేనంత బిజీ హీరోయిన్‌గా టాలీవుడ్‌లో వెలిగింది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో పేరు తెచ్చుకున్న రకుల్ ఆ తర్వాత వరసగా మెగా హీరోలతో పాటు టాలీవుడ్ యంగ్ అండ్ సీనియర్ హీరోలతో సినిమాలు చేసి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారింది. హైయ్యెస్ట్ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసి మరీ రకుల్ డేట్స్ లాక్ చేసుకునేవారు టాలీవుడ్ మేకర్స్.

rakul-preeth-singh-carear- decides that-one-movie

అయితే పూజా హెగ్డే, కీర్తిసురేష్, రష్మిక మందన్న లాంటి హీరోయిన్స్ వచ్చి క్రేజీ స్టార్స్‌గా మారడంతో రకుల్ హవా తగ్గిపోయింది. అదే సమయంలో రకుల్ నటించిన సినిమాలు కూడా సక్సస్ కాకపోవడంతో కెరీర్ బాగా స్లో అయింది. దానికి తోడు సీనియర్ స్టార్ హీరో నాగార్జున నటించిన మన్మధుడు 2 సినిమా చేయడం.. ఆ సినిమా డిజాస్టర్ కావడం ఇంకాస్త ఎఫెక్ట్ పడింది. అయితే లక్కీగా టాలీవుడ్‌లో ఒకేసారి రెండు సినిమాలలో అవకాశం అందుకుంది. యూత్ స్టార్ నితిన్ సరసన చెక్ సినిమా..అలాగే క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ నటించిన సినిమా.

Rakul preeth singh : రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం వెబ్ సిరీస్‌తో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు వస్తే చేసేందుకు రెడీగా ఉందట.

కానీ నితిన్‌తో చేసిన చెక్ సినిమా ఫ్లాప్‌గా మిగిలింది. ప్రస్తుతం క్రిష్ – వైష్ణవ్ తేజ్ సినిమా మీదే రకుల్ ప్రీత్ టాలీవుడ్ కెరీర్ ఆధారపడి ఉందని చెప్పుకుంటున్నారు. ఈ సినిమా హిట్ అయితే మళ్ళీ టాలీవుడ్‌లో అవకాశాలు వస్తాయంటున్నారు. ఇక బాలీవుడ్‌లో మాత్రం రకుల్ జోరు బాగానే కొనసాగుతోంది. అక్కడ వరసగా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీబిజీగా ఉంది. చూడాలి మరి రకుల్ ప్రీత్ సింగ్ మళ్ళీ టాలీవుడ్‌లో సత్తా చాటుందా లేదా. కాగా రకుల్ ప్రస్తుతం వెబ్ సిరీస్‌తో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు వస్తే చేసేందుకు రెడీగా ఉందట.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on ఏప్రిల్ 19, 2021 at 3:59 ఉద.