Ram Charan: మిస్ వరల్డ్ మానుషి చిల్లర్‌కు వింత కోరిక కలిగింది. మరి అది మన మెగా పవర్ స్టార్ రామ్మ్ చరణ్ తీరుస్తాడా అంటే ఆమె అదృష్టం మీదే ఆధారపడి ఉందంటున్నారు నెటిజన్స్. ఆర్ఆర్ఆర్ సినిమాతో బాలీవుడ్ హీరోల రేంజ్‌కు చేరుకున్నారు చరణ్. ఆయన మల్టీస్టారర్ సినిమాలను చేస్తూనే క్రియేటివ్ జీనియస్ శంకర్ లాంటి పాన్ వరల్డ్ డైరెక్టర్స్‌తో పాన్ ఇండియా చిత్రాలను చేస్తున్నారు. ప్రస్తుతం చరణ్ చేస్తున్న భారీ చిత్రం శంకర్ రూపొందిస్తున్నారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. చరణ్ మైల్ స్టోన్ మూవీ 15వది కావడం విశేషం. ఈ సినిమాలో చరణ్ డ్యూయల్ రోల్‌లో నటిస్తున్నారు. బాలీవుడ్ క్రేజీ బ్యూటీ కియారా అదవానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే దాదాపు 40 శారం షూటింగ్ కంప్లీట్ అయింది. అయితే, చరణ్ గతంలో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి జంజీర్ అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ఏకంగా గ్లోబల్ స్టార్ అయిన ప్రియాంక చోప్రా చరణ్ సరసన నటించడం హాట్ టాపిక్ అయింది.
Ram Charan: చరణ్‌తో కలిసి నటించే అవకాశం కోసం
అప్పటి నుంచే చరణ్ సరసన నటించేందుకు పలువురు బాలీవుడ్ క్రేజీ బ్యూటీస్ పోటీ పడుతున్నారు. ఇక ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాలో బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఆలియా భట్ నటించడంతో ఇప్పుడు ఆకోరిక మరికొంత బాలీవుడ్ హాట్ బ్యూటీస్ తీర్చుకోవాలనుకుంటున్నారు. కానీ, మిస్ వరల్డ్ అయిన మానుషి చిల్లర్ మాత్రం చరణ్‌తో డేట్ యాలనుకుంటోంది. డేట్ చాలారకాలున్నాయి. సరదాగా ఏ లంచ్‌కో, డిన్నర్‌కో వెల్లడం కూడా డేట్ అంటారు. ఇది కాకుండా కూడా డేట్స్‌లో రకాలున్నాయి. మరి మానుషి చరణ్‌తో కోరుకుంటున్న ఆ డేట్ ఏంటో అని నెటిజన్స్ ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నారు. అయితే, ఇటీవల అక్షయ్ కుమార్ నటించిన సినిమాలో మానుషీ చిల్లర్ ప్రధాన పాత్ర పోషించింది. దీని ప్రమోషన్స్‌లో బాగంగానే చరణ్‌తో డేట్ విషయం చెప్పింది. అవకాశం వస్తే మూవీ లేదా లంచ్‌కు వెళ్ళాలనే కోరికను.. అలాగే, చరణ్‌తో కలిసి నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్టు తెలిపింది.