Ram Charan: ఆర్ఆర్ ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ గా మారి ఆస్కార్ అవార్డు కూడా తీసుకున్న చరణ్ ని చూసి మెగాస్టార్ చిరంజీవి పుత్రోత్సాహంతో పొంగిపోతున్నారు. కొడుకు ఉన్నతిని చూసి గర్వపడుతున్నారు. ఇన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉంటూ కూడా తను సాధించలేని గ్లోబల్ స్టార్ గుర్తింపు తన కుమారుడు సాధించినందుకు గర్వంతో పొంగి పోతున్నారు. తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
అలాగే ఈ రోజు రామ్ చరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా చిరంజీవి తన ప్రేమను మరోసారి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు చెప్పి చాలా ఎమోషనల్ తో ట్విట్టర్లో పోస్ట్ చేశారు. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది నాన్న.. హ్యాపీ బర్త్డే అంటూ చరణ్ ని ముద్దు పెట్టుకుంటున్న ఫోటో ఒకటి షేర్ చేశారు చిరంజీవి. ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
సోషల్ మీడియాలో ఈ పోస్ట్ పై అభిమానులు వెంటనే స్పందించారు మీరు రామ్ చరణ్ మా పరిశ్రమలో ఉన్నందుకు మాకు గర్వంగా ఉంది సార్. ప్రపంచ పటంలో తెలుగుజాతికి ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు మాకు గర్వంగా ఉంది అని ఒక వ్యక్తి వ్యాఖ్యానించగా మరొక వ్యక్తి మీ ఇద్దరికీ అభిమానిగా ఉన్నందుకు గర్విస్తున్నాము లవ్ యు బోత్ అంటూ కామెంట్ పెట్టారు.
మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా చరణ్ చిరుత సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతోనే ప్రేక్షకుల అంచనాలను అందుకోవటంలో సక్సెస్ అయ్యాడు. చేసినవి 15 సినిమాలే అయినా పాన్ ఇండియా స్టార్ గా మారి ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా కూడా మారడం చిరంజీవితో పాటు మెగా అభిమానులకి కూడా ఎంతో ఆనందాన్ని ఇస్తున్న విషయం.
Ram Charan:
మగధీర, రంగస్థలం వంటి చిత్రాలలో మంచి నటన కనబరిచి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు మన చెర్రీ. ఆర్ ఆర్ ఆర్ మూవీ ద్వారా తండ్రిని మించిన తనయుడు అని కూడా అనిపించుకున్నాడు చరణ్. ఇక చరణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న గేమ్ చేంజెర్ అనే పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ద్వారా మన ముందుకి రాబోతున్నాడు.