Ram Charan: చిరంజీవి కుమారుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ఇప్పుడు రామ్ చరణ్ తండ్రి చిరంజీవి అనిపించుకునే స్థాయికి వెళ్ళాడు. 2007లో చిరుత సినిమాతో పరిచయమైన రామ్ చరణ్ ఆ ఏట ఉత్తమ నూతన నటుడిగా ఫిలింఫేర్ అవార్డుని అందుకున్నాడు. మగధీర ఘన విజయం అతన్ని మరో మెట్టు పైన నిలబెట్టింది.
రంగస్థలం సినిమాలో అతని నటన విమర్శకులను సైతం ఆకట్టుకుంది. ఆర్ ఆర్ ఆర్ విజయంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించి గ్లోబల్ స్టార్ అయిపోయాడు రామ్ చరణ్. తాజాగా చరణ్ ఆస్కార్ అవార్డుని కూడా గెలుచుకున్నాడు ఈ సందర్భంగా రామ్ చరణ్ కి ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి ప్రత్యేక పిలుపు కూడా వచ్చింది.
ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, స్టార్ సెలబ్రిటీలు పాల్గొనే కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకున్నాడు రామ్ చరణ్. సందర్భంగా ఢిల్లీలో ఇండియా టుడే కి ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు రామ్ చరణ్. ఈ ఇంటర్వ్యూలో భాగంగా తనకి విరాట్ కోహ్లీ ఆదర్శమని అతని బయోపిక్ లో నటించాలని ఉంది అంటూ తన మనసులో కోరికని బయట పెట్టాడు చరణ్.
Ram Charan:
ఇప్పుడు బయోపిక్ లో ట్రెండ్ నడుస్తుంది కాబట్టి అతని కోరిక తీరవచ్చు. పొలిటీషియన్లు, స్టార్ క్రికెటర్ల జీవిత చరిత్రను సినిమాలుగా చేస్తున్నారు. కొన్ని బయోపిక్ లు రిలీజ్ అని సాధించాయి. మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. వీటిలో నటించడానికి సూపర్ స్టార్ లు సైతం పోటీ పడటం విశేషం. ఆస్కార్ అవార్డు విన్ అయిన రామ్ చరణ్ ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన కోరికని వెలిబుచ్చాడు రామ్ చరణ్.
ఆర్ ఆర్ ఆర్ సినిమాతో హాలీవుడ్ దర్శకులని కూడా ఆకర్షించాడు రామ్ చరణ్ జేమ్స్ కెమెరా స్పిల్ బర్గ్ లాంటి వాళ్లు కూడా రామ్ చరణ్ నటనకి ప్రశంసలు కురిపించారు. ఇక ఆ సినిమా ప్రమోషన్స్ కి వెళ్ళినప్పుడు అతనికి అక్కడ రిసీవింగ్ అండ్ రెస్పాన్స్ అద్భుతంగా జరిగింది.