Ram Gopal Varma: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సూపర్ మహేశ్ బాబుతో బిజినెస్ మేన్ అనే పక్కా కమర్షియల్ సినిమా తీసి హిట్ కొట్టాడు. ఆ సినిమా కథ తయారవడానికి కారణం సంచలన దర్శకుడు..వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన దర్శక, నిర్మాత రాం గోపాల్ వర్మ అనే విషయం మాత్రం చాలా తక్కువ మందికే తెలుసు. నాలాంటోడు చేతిలో రూపాయి లేకుండా ముంబై వచ్చాడు. ఓ డాన్‌గా ఎదిగాడు. ముంబైనే గడగడలాడించాడు..దీని బేస్ చేసుకొని కథ రాయి అని చెప్పాడు వర్మ. ఆ మాటలే ఇన్స్పిరేషన్గా తీసుకొని పూరి బిజినెస్ మేన్ కథ రాసి సినిమా తీశాడు.
పూరి తీసిన టాప్ టెన్ చిత్రాలలో ఖచ్చితంగా బిజినెస్ మేన్ ఉంటుంది. అయితే, ఆర్జీవీ లా బ్రతకడానికి మాత్రం ఇన్సిపిరేషన్ మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజ అని తాజాగా చెప్పి అందరికీ వర్మ షాకిచ్చాడు. ఆయన ఎప్పుడు సినిమా తీసిన అది ఎంతటి వివాదాన్ని రాజేస్తుందో అందరికీ తెలిసిందే. అలాంటి వివాదాన్ని, సంచలనాన్ని విడుదలకు ముందే సృష్ఠిస్తోంది వర్మ తాజా చిత్రం మా ఇష్టం. దేశంలోనే ఇప్పటి వరకు ఇద్దరు అమ్మాయిల మధ్య ప్రేమ అనే కథాంశంతో సినిమా రావడం ఇదే మొదటి సారి. హాలీవుడ్లో ఈ తరహా చిత్రాలను లెస్బియన్ సినిమాలంటారు.

Ram Gopal Varma: ‘చెన్నైలో కుక్క కూడా బతుకుతుంది’..
ఇప్పుడు పలు వాయిదాల తర్వాత మా ఇష్టం సినిమా కొన్ని గంటలలో థియేటర్స్‌లోకి వస్తోంది. ఈ నేపథ్యంలో తన ఇద్దరు హీరోయిన్స్‌లో కలిసి ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు ఆర్జీవీ. ఈ క్రమంలో నిర్వహించిన ప్రమోషన్స్‌లో ఒకరు మీలా ఇష్టమొచ్చినట్టు బ్రతకాలంటే ఏం చేయాలి..మీకంటే డబ్బు ఉంది…మరి మాలాంటి వారి పరిస్థితీ అని అడిగాడు. దానికి వర్మ చెప్పిన ఇన్స్పిరేషనల్ ఆన్సర్ మైండ్ బ్లాక్ చేసింది. కొన్నేళ్ల క్రితం సంగీత దర్శకుడు ఇళయరాజా గంగై అమరన్ మధ్య జరిగిన ఓ ఆసక్తికరమైన సంభాషణను బయటపెట్టారు వర్మ. సినిమా ఇండస్ట్రీకి రాకముందు ఇళయరాజా ఊళ్లో వుండే వారు. అయితే, గంగై అమరన్ ‘ఊళ్లో ఎందుకు చెన్నై వచ్చేయ్ నీకున్న టాలెంట్‌తో ఎక్కడో ఒకచోట పని చూస్తా..అన్నారు.
అందుకు ఇళయరాజా ‘అసలు ఊర్లోనే నేను బ్రతకలేకపోతుంటే..ఇక చెన్నై వచ్చి ఎలా బతుకుతాను’ అన్నారు. దాంతో గంగై అమరన్ ‘చెన్నైలో కుక్క కూడా బతుకుతుంది’ అన్నారు. ఆయన మాటల వల్లే ఇళయరాజా ఊరు వదిలి చెన్నై వచ్చి రిస్క్ చేశారు. అలా రిస్క్ చేశారు కాబట్టే ఆయన ఇంతగా సక్సెస్ అయ్యారు..అని ఆర్జీవి చెప్పుకొచ్చారు. దీంతో నేనే కాదు ఎవరైనా తమకి ఇష్టమొచ్చినట్టు బ్రతకాలంటే రిస్క్ చేయాలని చెప్పకనే చెప్పారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.