Ram gopal varma : శివ సినిమా టాలీవుడ్ లో ఓ సంచలనం. ఇండస్ట్రీ హిట్. నాగార్జున కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ సాధించిన సినిమా. డైరెక్షన్ అంటే తెలియని వర్మ అమీర్ పేట్ లో ఓ వీడియో లైబ్రెరి నడుపుతూ డైరెక్టర్ అయ్యాడు. అన్నపూర్ణ బ్యానర్ లో నాగార్జున అన్నయ్య వెంకట్ అక్కినేని ద్వారా నాగార్జున కి కథ చెప్పి ఒప్పించాడు. దర్శకత్వ శాఖలో అనుభం లేని రాం గోపాల్ వర్మ మీద నాగార్జున పెట్టుకున్న నమ్మకమే శివ సినిమాకి పునాది..నాంది. కథ ఒప్పించే టాలెంట్ ఉన్న వర్మ ..శివ కథ అద్భుతంగా చెప్పాడు.

ram-gopal-varma is giving life to many

సినిమా రిలీజయ్యాక సెన్షేషనల్ హిట్ అయింది. దాంతో వర్మ ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అయ్యాడు. అక్కినేని ఫ్యామిలీ నుంచి సుమంత్ ని హీరోగా లాంచ్ చేశాడు. వెంకటేష్ కి క్షణ క్షణంతో హిట్ ఇచ్చాడు. బాలీవుడ్ కి వెళ్ళి అక్కడ భారీ హిట్స్ ఇచ్చాడు. అమితాబ్ బచ్చన్, జాకీ ష్రాఫ్ సహా పలువురు స్టార్స్ తో భారీ కమర్షియల్ హిట్స్ అందుకున్నాడు. సంచలనమైన సినిమాలు తీయాలంటే వర్మ తర్వాతే. జోనర్ ఎలాంటిదైనా వర్మ టచ్ చేస్తాడు. ఆయన దృష్టిలో జీఎస్టీ కూడా సినిమానే. ప్రొఫెషనల్ గా చేస్తాడు ఏం చేసినా. ఇక్కడే దర్శకులు, నటీ నటులకు..ఇతర 24 శాఖలకు చెందిన వాళ్లకి అవకాశాలు కల్పిస్తాడు.

Ram gopal varma : సినీ ప్రపంచానికి పరిచయం చేసి లైఫ్ ఇచ్చాడు.

ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్స్ అయిన పూరి జగన్నాథ్, హరీష్ శంకర్, కృష్ణ వంశీ సహా కొందరు యంగ్ డైరెక్టర్ ఆయన నుంచి వచ్చిన వాళ్ళే. బాలీవుడ్ లో ఇప్పుడు ఉన్న క్రీం ఏదైతే ఉందో మొత్తం వర్మ నుంచి వచ్చిందే. రెండు సినిమాలు చేసిన రాని గుర్తింపు అప్సర రాణి అని పేరు పెట్టి వర్మ పరిచయం చేస్తే స్టార్ అయిపోయింది. జగపతి బాబు వాయిస్ బాగోలేదనే కామెంట్స్ వినిపించాయి. కానీ ఈ రోజు ఆయన వాయిస్ కి క్రేజ్ ఉందంటే అది వర్మ ప్రోద్భలమే. ఇలా చాలా మందికి వర్మ సినీ ప్రపంచానికి పరిచయం చేసి లైఫ్ ఇచ్చాడు. కానీ అందరు ఆయనని మాత్రం కామెంట్స్ చేస్తుంటారు. ఆయన తీసే సినిమాలను..ఆయన అనే మాటలను ఎత్తి చూపుతుంటారు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 4, 2021 at 9:41 సా.