Rangasthalam : రంగస్థలం సినిమా సీక్వెల్ కి సుకుమార్ – చరణ్ ప్లాన్ చేస్తున్నట్టు ఈ మధ్య పలు సోషల్ మీడియా సైట్స్‌లో వార్తలు వచ్చి వైరల్ అయ్యాయి. అందుకు కారణం ఈ నెల 30న రంగస్థలం తమిళ డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ కాబోతుండటమే. ఈ క్రమంలో రీసెంట్‌గా రంగస్థలం తమిళ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇప్పటికే రంగస్థలం మలయాళం వెర్షన్ రిలీజై అక్కడ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మంచి వసూళ్ళు కూడా రాబట్టడంతో కోలీవుడ్ లో కూడా ఈ సినిమాని రిలీజ్ చేయాలని మేకర్స్ డిసైడయ్యారు.

rangasthalam-sequal-fans-say-no

ఈ క్రమంలోనే ఇటీవల రిలీజైన రంగస్థలం తమిళ ట్రైలర్ రిలీజ్ చేయగా బాగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే చరణ్ నటించిన పలు సూపర్ హిట్ సినిమాలు తమిళంలో డబ్ అయి అక్కడి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. చరణ్ సినిమాలకి తమిళ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంది. ఇక తాజాగా రిలీజైన రంగస్థలం ట్రైలర్ తర్వాత సుకుమార్ – చరణ్ రంగస్థలం సినిమా సీక్వెల్ చేయాలన్న ఆలోచనకి వచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాదు రంగస్థలం సినిమా సమయంలోనే సీక్వెల్ కి ఒక ఐడియా ఉన్నట్టు..ఆ ఐడియా చరణ్ కి చెప్పినట్టు సమాచారం.

Rangasthalam : రంగస్థలం సీక్వెల్ చేయకుండా ఉంటేనే మంచిదని అభిప్రాయపడుతున్నారట.

అయితే అభిమానులు మాత్రం రంగస్థలం సినిమా సీక్వెల్ వద్దంటున్నారట. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంటాయి. అయితే ఇలాంటి సినిమాలు సీక్వెల్ అంటే మాత్రం కత్తి మీద సామే. కథలో ఏమాత్రం తేడా జరిగినా సినిమా సక్సస్ మీద గట్టి ప్రభావం చూపిస్తుంది. పైగా సీక్వెల్ చేసే సమయానికి హీరో ఇమేజ్ కూడా మారిపోతుంది. ఇవన్ని ఆలోచిస్తే రంగస్థలం సీక్వెల్ చేయకుండా ఉంటేనే మంచిదని అభిప్రాయపడుతున్నారట. కాగా చరణ్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్, ఆచార్య సినిమాలు పూర్తి చేసే పనిలో ఉన్నాడు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on ఏప్రిల్ 24, 2021 at 8:13 సా.