Rashi Khanna చై – సామ్ విడాకుల వెనుక ఆ తెలుగు హీరోయిన్ ఉందట… నిజమేనా….?

Joythi R

Rashi Khanna రాశి కన్నా. ఈ పేరు వినగానే టాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన యంగ్ బ్యూటిఫుల్ హీరోయిన్ గుర్తొస్తుంది. అయితే నటి రాశి ఖన్నా సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కొంత బొద్దుగా ఉండేది. కానీ సినిమా ఆఫర్ల కోసం క్రమ క్రమంగా బరువు తగ్గింది. అంతగా ఈ అమ్మడికి నటనపై ఫ్యాషన్ ఉంది. దీంతో నటి రాశి ఖన్నా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది చిన్న బడ్జెట్ తరహా చిత్రంతోనే అయినప్పటికీ క్రమక్రమంగా స్టార్ హీరోల సరసన నటించే ఆఫర్లు దక్కించుకుని తన ప్రతిభను నిరూపించుకుంది. మామూలుగా చిన్న బడ్జెట్ తరహా చిత్రాలతో ఎంట్రీ ఇచ్చి 1, 2 చిత్రాల్లో ఆఫర్లు రాగానే ఫేడ్ అవుట్ ఎటువంటి హీరో హీరోయిన్లు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు కానీ నటి రాశి ఖన్నా మాత్రం పట్టు విడవకుండా శ్రమించి స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

అయితే ఈ మధ్య కాలంలో నటి రాశి కన్నా సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలో అప్పుడప్పుడు తనకు సంబంధించిన అందమైన ఫోటోలు మరియు వీడియోలు వంటివి షేర్ చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా నటి రాశి కన్నా తనకు సంబంధించిన అందమైన ఫోటోని షేర్ చేసింది. అయితే ఈ ఫోటోకి లక్షల సంఖ్యలో లైకులు కామెంట్లు వచ్చాయి. కానీ ఓ నెటిజన్ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ టాలీవుడ్ హీరో హీరోయిన్ అయిన చై సామ్ విడాకులు తీసుకున్న విషయాన్ని గర్తు చేస్తూ వీరిద్దరూ విడిపోవడానికి నువ్వే కారణమని కామెంట్ చేశాడు. అలాగే మరో నెటిజన్ ఏకంగా సిద్దార్థ్ మల్హోత్రా మరియు కియరా అద్వాని విడిపోవడానికి కూడా నువ్వే కారణమని కామెంట్ చేశాడు. దీంతో ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇదేమి చిల్లర ట్రోలోంగ్ అంటూ హీరోయిన్ రాశి ఖన్నా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Rashi Khanna చై - సామ్ విడాకుల వెనుక ఆ తెలుగు హీరోయిన్ ఉందట... నిజమేనా....?
Rashi Khanna చై – సామ్ విడాకుల వెనుక ఆ తెలుగు హీరోయిన్ ఉందట… నిజమేనా….?

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నటి రాశి ఖన్నా తెలుగులో పక్కా కమర్షియల్ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం మే 1వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ చిత్రంలో నటి రాశి కన్నా లాయర్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఇటీవలే ఈ అమ్మడుకి తమిళ్ లో ఓ ప్రముఖ హీరో నటిస్తున్న చిత్రంలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ వరించినట్లు సమాచారం.

- Advertisement -