rashmi gautam : రష్మీ గౌతం బుల్లితెరమీద ఎంతగా పాపులర్ అయిందో  అందరికీ తెలిసిందే. ప్రస్తుతం గ్లామరస్ యాంకర్స్ లో రష్మీ టాప్ ప్లేస్ లో ఉంది.
వల్గారిటీ లేకుండా..మరీ శృతి మించిన ఎక్ఫ్‌ఫోజింగ్ చేయకుండా కేవలం ఎక్స్‌ప్రెషన్స్‌తోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సినిమా స్టార్ హీరోయిన్ కి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ సొంతం చేసుకుంది రష్మీ. ఎంతమంది యాంకర్స్ ఉన్నా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. షో ఎలాంటిదైనా తన మార్క్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోవాల్సిందే. ఇదే క్రమంలో గుంటూరు టాకీస్ సినిమాతో గ్లామరస్ హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకుంది.

rashmi-gautam-is ready to play any type of role to maintain bank balance or get satisifaction.
rashmi-gautam-is ready to play any type of role to maintain bank balance or get satisifaction.

హీరోయిన్ గా ఎలాంటి రోల్స్ చేయడానికైనా రష్మీ సిద్దం అని చెప్పిన సందర్భాలున్నాయి. గుంటూరు టాకీస్ సినిమాలో రొమాంటిక్ సీన్స్, లిప్ లాక్స్ తో ప్రేక్షకులను బాగానే కనువిందు చేసింది. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసిన రష్మీ స్టార్ హీరోయిన్ గా మాత్రం అవకాశాలు అందుకోలేకపోయింది. బుల్లితెర మీద తనకున్న క్రేజ్ కారణంగా రెమ్యునరేషన్ భారీగా డిమాండ్ చేసిందనేది కొంతమంది మేకర్స్ చేసిన కామెంట్. తను రెమ్యునరేషన్ డిమాండ్ చేయడం వల్లే హీరోయిన్‌గా అవకాశాలు దక్కించుకోలేకపోతోందని అన్నవారున్నారు. దానికి రష్మీ సాలీడ్ రీజన్ కూడా ఇచ్చింది.

Rashmi gautam : కాంప్రమైజ్ అయి చేయడం ఎందుకు.

రష్మీ అంటే అందరికీ తెలిన పర్సన్. నేనేదో కొత్తగా ఇండస్ట్రీకి రాలేదు. స్మాల్ స్క్రీన్ మీద నాకంటూ మంచి క్రేజ్ ఉంది. రెమ్యునరేషన్ కూడా శాటిసిఫైడ్ గా వస్తోంది. అలాంటప్పుడు కాంప్రమైజ్ అయి చేయడం ఎందుకు. ఒక క్యారెక్టర్ చేస్తే బ్యాంక్ బ్యాలెన్స్ అయినా శాటిసిఫైడ్ గా ఉండాలి. లేదా ఆ క్యారెక్టర్ నాకు ఇంకా పేరు తెచ్చేదిగా ఉండాలి. అంతేకానీ తక్కువ రెమ్యునరేషన్ కి చేయి..నెక్స్ట్ నీకు మంచి ఆఫర్స్ వస్తాయంటే నేను నమ్మను. ఈ రోజు ఒక మాట చెప్పినవాళ్ళు ఆ తర్వాత అదే మాట మీద ఉండకపోవచ్చు..ఇది రంగుల ప్రపంచం. ఎవరు ఎప్పుడు ఎలా ఛేంజ్ అవుతారో ఎవరం చెప్పలేము అంటూ తన అనుభావలను చెప్పుకొచ్చింది రష్మీ గౌతం.

 

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూలై 17, 2021 at 8:30 ఉద.