Jai Rashmi Gautam Anthaku Minchi Movie Posters

Rashmi gowtham : సినిమా ఇండస్ట్రీలో ఒక మోడల్ గానీ, కొత్తగా హీరోయిన్‌గా ట్రై చేసే అమ్మాయికి గానీ ముందు ఉండాల్సింది అందం అభినయం. ఇవి సరిపోవు..ఆ తర్వాత కావాల్సింది క్యారెక్టర్ డిమాండ్ చేస్తే లిప్ లాక్స్‌కి రెడీ అనాలి. గ్లామర్ సీన్స్, స్కిన్ షో చేయడానికి సై అనాలి. అప్పుడే ఇక్కడ స్టార్ హీరోయిన్‌గా సెటిలవుతారు. ఇవన్నీ చేయడానికి తెలుగమ్మాయిలకంటే ముంబై మోడల్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. వాళ్ళ మాదిరిగా మనవాళ్ళు అన్నీ సీన్స్ చేయడానికి తెగించరు. అందుకే దర్శక, నిర్మాతలు కూడా కాస్త తెలుగు అమ్మాయిలను దూరం పెడతారన్నది ఒక టాక్.

rashmi-gowtham is unable to become a star heroine

అయితే వైజాగ్ అమ్మాయి అయిన రష్మీ గౌతమ్ ఎలాంటి పాత్రలు చేయడానికైనా సిద్దంగా ఉంటుంది. తనకి మంచి పర్ఫార్మర్ అని పేరుంది. గ్లామర్ రోల్స్, స్కిన్ షో కూడా వల్గారిటీ లేనంత వరకు ఓకే అంటుంది. కథ, అందులో పాత్ర డిమాండ్ చేస్తే లిప్ కిసెస్ ఇవ్వడానికి వెనకాడదు. అందం, అభినయం పరంగా కూడా ముంబై వాళ్ళకంటే వందకి వంద శాతం పర్‌ఫెక్ట్ అని చాలా సందర్భాలలో నిరూపించుకుంది. కానీ స్టార్ హీరోయిన్‌గా మాత్రం టాలీవుడ్‌లో సెటిలవలేకపోయింది. అందుకు కారణం ఈమె బుల్లితెర నుంచి రావడమే అనేది ఒక కారణం.

Rashmi gowtham : రష్మీ కాన్సెప్ట్ ఒకటే బ్యాంక్ బ్యాలెన్స్ అయినా తృప్తిగా ఉండాలి.

టాలెంట్ ఉన్న వాళ్ళకి ఎందుకనో పెద్ద హీరోల సినిమాలలో అవకాశాలు రావంటుంటారు. అందుకు కళ్ళకి కనిపిస్తున్న ఉదాహరణ రష్మీ. తనకి నిజంగా యంగ్ హీరోలతో అవకాశం వస్తే ఖచ్చితంగా స్టార్ స్టేటస్ అందుకుంది. కానీ ఇలాంటి టాలెంటెడ్ అమ్మాయికి అవకాశం ఇచ్చేదెవరు. ఇక రష్మీ బుల్లితెర మీద చాలా బిజీగా ఉంది. మంచి రెమ్యునరేషన్ కూడా అందుకుంటోంది. ఇలాంటి సమయంలో సినిమాకి డేట్స్ ఇవ్వాలంటే ఇక్కడ వచ్చే అమౌంట్ అక్కడ కూడా రావాలి. లేదంటే రష్మీ లాంటి వాళ్ళకి చేసి కూడా పెద్దగా ఉపయోగం ఉండదు. రష్మీ కాన్సెప్ట్ ఒకటే బ్యాంక్ బ్యాలెన్స్ అయినా తృప్తిగా ఉండాలి..లేదా పెద్ద సినిమా అవ్వాలి. చూడాలి రానున్న రోజుల్లో రష్మీ స్టార్ హీరోయిన్ అవుతుందా లేదా.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 14, 2021 at 7:00 సా.