Rashmi: బుల్లితెరపై మెరిసిన గ్లామరస్ యాంకర్ రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎక్స్ట్రా జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయిన రష్మి వచ్చీరానీ తెలుగులో మాట్లాడుతూ తన అందంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇలా ఎక్స్ట్రా జబర్దస్త్ ద్వారా బుల్లితెరపై యాంకర్ గా మెరిసిన రష్మి సుడిగాలి సుధీర్ తో కలిసి చేసిన సందడి అంతా ఇంతా కాదు. వీరిద్దరూ మధ్య కెమిస్ట్రీ చూసిన ప్రేక్షకులు వీరు నిజంగానే ప్రేమించుకుంటున్నారని భావించారు. అంతే కాకుండా వీరిద్దరూ ఎన్నో సార్లు జబర్దస్త్ వేదికగా పెళ్లి కూడా చేసుకున్నారు. దీంతో రష్మి – సుధీర్ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని వారి అభిమానులు కూడా భావించారు.
అయితే ఇదంతా కేవలం టీఆర్పీ రేటింగ్స్ కోసం మాత్రమేనని తామిద్దరూ కేవలం స్నేహితులమని రష్మి తేల్చి చెప్పింది. దీంతో ఇంత వయసు వచ్చినా కూడా రష్మి బ్యాచ్లర్ గానే ఉండటంతో ఆమె పెళ్లి గురించి ఇప్పటికే అనేక వార్తలు వినిపించాయి. ఇదిలా ఉండగా తాజాగా రష్మీ గౌతమ్ తనకు కాబోయే భర్త గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో రష్మీ సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈవారం ఎపిసోడ్ లో తమకు కాబోయే భర్తలపై సీరియల్ నటీమణులతో పాటు యాంకర్ రష్మీ కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
Rashmi: నేను చెప్పిందే చేయాలి..
ఈ క్రమంలో రష్మీ గౌతమ్ తనకి కాబోయేవాడి గురించి మాట్లాడుతూ.. ” నాకు కాబోయే వాడు.. నేను చెప్పిందే చేయాలి…తాను చేసిందే చెప్పాలి ” అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దీంతో సుధీర్ కూడా నువు చెప్పిందే చేస్తున్నాడు కదా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇలా పెళ్లి గురించి ఎన్ని వార్తలు వస్తున్నా కూడా రష్మి మాత్రం ఆ వార్తలపై స్పందించటం లేదు. ఈ యాంకరమ్మను పెళ్లి చేసుకోబోయే వాడు ఎవరా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.