Rashmika Mandanna ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ప్రముఖ సిద్ధాంతి వేణు స్వామి పేరు తెగ వినిపిస్తోంది. అయితే వేణు స్వామి గతంలో ఎంటర్టైన్మెంట్ చానల్స్ లో ఉదయం పూట వచ్చే భక్తి ప్రోగ్రామ్స్ లో బాగా కనిపించేవాడు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాలు అందరికీ అందుబాటులోకి రావడంతో యూట్యూబ్ ఛానల్స్ లో కూడా సినీ సెలబ్రిటీల జాతకాలు చెబుతూ బాగానే పాపులర్ అవుతున్నాడు. అయితే వేణు స్వామి కన్నడ ప్రముఖ హీరోయిన్ రష్మిక మందాన జాతకం గురించి ప్రేక్షకులకు పల ఆసక్తికర విషయాలను తెలియజేశాడు.
ఇందులో భాగంగా రష్మిక మందన కన్నడ ప్రముఖ హీరో రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం ఖాయం చేసుకున్న సమయంలో తన జాతకం చూశానని దాంతో అప్పుడే వీరిద్దరు పెళ్లి జరగదని తనకి తెలిసిపోయిందని తెలిపారు. అలాగే ఈ విషయం గురించి రష్మిక మందన్న కుటుంబ సభ్యులకు కూడా తెలియజేశారని ఇక వీరిద్దరూ ఎందుకు కలిసి ఉండలేరని కారణాల గురించి స్పందిస్తూ మొదటగా రష్మిక మందన్న మరియు రక్షిత్ శెట్టిల జాతకాలు కలవలేదని అంతేకాకుండా, వీరిద్దరూ లైఫ్ స్టైల్ కూడా భిన్నంగా ఉండటంతో ఎక్కువ కాలం కలిసి ఉండలేరని చెప్పుకొచ్చాడు.
దాంతో రష్మిక మందన్న కూడా నిశ్చితార్థం జరిగిన తర్వాత ఎంగేజ్మెంట్ ని బ్రేక్ చేసిందని తెలిపాడు. దీంతో కొంతమంది రష్మిక ఫ్యాన్స్ మాత్రం ఈ విషయంపై భిన్నంగా స్పందిస్తున్నారు. ఇందులో భాగంగా కిరాక్ పార్టీ చిత్రంలో నటించేటప్పుడు వీరిద్దరూ ప్రేమలో పడ్డారని కానీ కిరాక్ పార్టీ చిత్రం తరువాత నటి రష్మిక మందన్నకి వరుసగా సినిమా ఆఫర్లు రావడంతో ఆమె కెరియర్ పూర్తిగా మలుపు తిరిగిందని దాంతో రష్మిక తన కెరీర్ పై దృష్టి సారించెందుకే పెళ్లిని పక్కన పెట్టిందని అంతేతప్ప వేరే కారణాలేవి లేవని స్పందిస్తున్నారు. ఇక మరికొందరైతే 20వ సెంచరీలో కూడా జాతకాలు, మూఢనమ్మకాలు ఆచారాలు వంటివాటిని నమ్మటం సరికాదని కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నటి రష్మిక మందన్న వరుస సినిమా ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. కాగా ఈ బ్యూటీ తమిళ ప్రముఖ హీరో విజయ్ హీరోగా నటిస్తున్న మరో భారీ బడ్జెట్ చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది. కాగా ఆమధ్య నటి రష్మిక తెలుగులో ఆడవాళ్ళు మీకు జోహార్లు అనే చిత్రంలో హీరోయిన్గా నటించింది. కానీ ఈ చిత్రం డిజాస్టర్ గారు నిలిచింది. కాగా ప్రస్తుతం అమ్మడు హిందీ, తెలుగు, తమిళం తదితర భాషలలో కలిపి నాలుగు పైగా చిత్రాలలో హీరోయిన్గా నటిస్తోంది.