Rashmika Mandanna కన్నడ సోయగం రష్మిక మందన్నా ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ కన్నడ కస్తూరి నటిస్తోన్న సినిమాల్లో ఒకటి బాలీవుడ్ ప్రాజెక్టు యానిమల్. అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంపై క్రేజీ అప్ డేట్ బయటకు వచ్చింది. యానిమల్ సినిమా షూటింగ్ షురూ అయింది. హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీలో ఈ షెడ్యూల్ జరుగనుంది. కాగా యానిమల్ షూటింగ్ కోసం మనాలీకి వచ్చిన రణ్ బీర్, రష్మికకు ఘనస్వాగతం లభించింది.
రణ్ బీర్ , అలియాకు హిమాచలీ సంప్రదాయ టోపీ అందించి గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు అక్కడి అధికారులు. ఈ ఇద్దరు హీరోహీరోయిన్లు వైట్ అండ్ బ్లాక్ అవుట్ ఫిట్స్ లో..హిమాచల్ టోపీని పెట్టుకుని ఒకే లుక్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా కనిపిస్తున్నారు. ఇపుడీ ఫొటోలు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి.
నేను చాలా థ్రిల్ అయ్యాను. ప్రపంచానికి చెప్పాలని వేచి చూశాను. ఎందుకంటే కథతోపాటు నేను పనిచేసే టీం కూడా చాలా అద్భుతంగా ఉంది. నా కల నిజమైంది వంటిది.
నేను ఈ వేసవి కోసం ఎదురు చూస్తున్నా..సినిమా త్వరలో సెట్స్‌పైకి వెళ్లే వరకు వేచి ఉండలేను..అంటూ యానిమల్‌లో నటించే ఛాన్స్ రావడం పట్ల చాలా ఎక్జయిటింగ్ అవుతున్నట్టు రష్మిక ఇప్పటికే చెప్పుకొచ్చింది. అర్జున్ రెడ్డి , కబీర్ సింగ్ సినిమాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. రష్మిక కూడా పుష్ప తర్వాత చేస్తున్న సినిమా కావడంతో ఈ సారి ఎలాంటి రోల్‌లో కనిపించబోతుందని థ్రిల్ అవుతున్నారు ఫ్యాన్స్.